హుజూరాబాద్ టీఆర్ఎస్‌దే: కేటీఆర్ ఆ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు?

-

చాలా రోజుల తర్వాత మంత్రి కేటీఆర్ ( KTR ), హుజూరాబాద్ ఉపఎన్నిక, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై స్పందించిన విషయం తెలిసిందే. తమ పార్టీలో ఈటలకి ఎలాంటి అన్యాయం చేయలేదని, పార్టీ ద్వారా ఈటల ఆర్ధికంగా లబ్ది పొంది, ఇప్పుడు బయటకెళ్లి అనవసరమైన విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. భూ కబ్జా విషయంలో తప్పు ఒప్పుకునే ఈటల బయటకెళ్లారని అన్నారు.

ktr | కేటీఆర్

రాజేందర్‌ను కాపాడుకోవటానికి, చివరి వరకు పార్టీలో ఉండాలని తాను వ్యక్తిగతంగా ప్రయత్నం చేశానని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ ఆయనే పార్టీని వదిలి వెళ్లారని, అయితే టీఆర్ఎస్, కేసీఆర్ ద్వారా లబ్ది పొంది, ఇప్పుడు వారిపైనే విమర్శలు చేయడాన్ని సహించేది లేదని అన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్సే గెలుస్తుందని, ఈటల టీఆర్ఎస్‌లోకి రాకముందు నుంచే హుజూరాబాద్‌లో బలంగా ఉన్నామని, అలాగే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని బీజేపీ ఖాతాలో ఈటెల రాజేందర్ ఎలా వేసుకుంటారని కేటీఆర్ ప్రశ్నించారు.

అంటే ఇప్పటివరకు హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌నే అభివృద్ధి చేసిందని, ఈటల ఏం చేయలేదనే కోణంలో కేటీఆర్ మాట్లాడినట్లున్నారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది అని, కానీ దుబ్బాకలో కూడా టీఆర్ఎస్సే అభివృద్ధి చేసిందని, మరి అక్కడ టీఆర్ఎస్ ఎందుకు ఓటమి పాలైందని బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

ఈటల వల్లే హుజూరాబాద్‌లో అభివృద్ధి జరిగిందని ఆ విషయం అక్కడి ప్రజలకు తెలుసని, టీఆర్ఎస్ ఎన్ని మాటలు చెప్పిన ప్రజలు నమ్మరని అంటున్నారు. టీఆర్ఎస్ అంత బాగా అభివృద్ధి చేస్తే దుబ్బాకలో ఎందుకు ఓడిందని, జి‌హెచ్‌ఎం‌సిలో టీఆర్ఎస్‌ని ఓడించినంత పని ఎందుకు చేశారని కేటీఆర్‌ని అడుగుతున్నారు. ఏదేమైనా కేటీఆర్ లాజిక్ మిస్ అయ్యి మాట్లాడుతున్నారని, హుజూరాబాద్‌లో ఈటలదే గెలుపు అని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version