రాజకీయాల్లో నేతలు ఎన్నికల్లో గెలవడానికి ప్రజలకు ఎప్పుడు హామీలు ఇస్తూనే ఉంటారు. గెలవడం కోసం అసాధ్యం కాని హామీలైన ఇచ్చేస్తుంటారు. ఇక వాటిని ప్రజలు నమ్మి ఓట్లు వేసి, గెలిపిస్తుంటారు. గెలిచి అధికారంలోకి వచ్చాక ఆ హామీలని అమలు చేయలేక నానా ఇబ్బందులు పడతారు. ఇచ్చిన మాట తప్పారని జనాలకు అర్ధమై…నెక్స్ట్ ఎన్నికల్లో ఆ నేతకు ఓటు వేయరు.
అయితే గతంలో చంద్రబాబు రైతు రుణమాఫీ అని, ఇప్పుడు జగన్ మద్యపాన నిషేధం అని చెప్పి సాధ్యం కాని హామీలు ఇచ్చారు. ఇవే కాదు..ఇంకా పలు హామీలని పూర్తిగా అమలు చేయడం లేదు. మరి గతంలో మాట తప్పారని ప్రజలు…బాబుని ఓడించారు. మరి నెక్స్ట్ జగన్ పరిస్తితి ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు గురించి పక్కన పెడితే…అధినేతలు…తమ సొంత పార్టీ నేతలకు ఇచ్చిన హామీలనే అమలు చేయడం లేదు.
రాజకీయ అవసరాల కోసం చాలామంది నేతలకు మంత్రి పదవి అని, ఎమ్మెల్సీ అని, నామినేటెడ్ పదవి అని హామీ ఇస్తారు…కానీ నేతలకు ఇచ్చిన హామీలని పూర్తిగా అమలు చేయరు. గతంలో చంద్రబాబు అలాగే చేశారు. ఇప్పుడు జగన్ అదే చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ కొంతమందికి పదవి ఆశించి చూపించారు…కొందరికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఉదాహరణకు మంగళగిరిలో లోకేష్‌పై గెలిస్తే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని అన్నారు..అటు చిలకలూరిపేట సీటు త్యాగం చేసిన మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇస్తానని అన్నారు.
కానీ ఈ హామీలని నెరవేర్చలేదు. ఇలా హామీలు నెరవేర్చకుండా ఈ మధ్య కొందరు నేతలకు మళ్ళీ హామీలు ఇస్తున్నారు. కుప్పంలో చంద్రబాబుపై గెలిస్తే భరత్‌కు మంత్రి పదవి ఇస్తానని, అలాగే రాజాంలో మరోసారి గెలిస్తే కంబాల జోగులుకు మంత్రి పదవి ఇస్తానని అంటున్నారు. గెలుపోటములు సంగతి పక్కన పెడితే…గతంలో ఇచ్చిన హామీలనే నెరవేర్చలేదు..ఇప్పుడు మళ్ళీ హామీలు ఇస్తే ఆయా నియోజకవర్గ ప్రజలు నమ్ముతారా? అనేది పెద్ద ప్రశ్న. అన్నివేళలా ప్రజలు నమ్మే పరిస్తితి ఉండదు.