నామినేటెడ్ పదవుల పందేరం తెలంగాణ కాంగ్రెస్ లో అసంత జ్వాలలకు కారణం అవుతుంది.. పార్టీలో ఉన్న సీనియర్లకు కాదని.. వలస నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారంటు ఇద్దరు మంత్రులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. సామాజిక న్యాయం పాటించట్లేదని కొందరు సీనియర్లు ఆగ్రహంతో ఉంటే.. ప్రయారిటీ పోస్టులు ఇవ్వట్లేదు అంటూ మరికొందరు తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నరట.. ఈ సమయంలోనే ఇద్దరు మంత్రులు అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేశారని పార్టీలో చర్చి నడుస్తుంది..
నిన్న మొన్నటివరకు బిఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించిన నేతలు అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇక్కడికి జంప్ అయ్యారు.. మంత్రులు అండదండలతో కీలక పదవులు పొందుతున్నారు. దీంతో ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరం మంత్రులు నామినేటెడ్ పదవుల పందారం పై సీరియస్ గా ఉన్నారని టాక్ నడుస్తోంది.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓ నేతకు రాష్ట్రస్థాయి పదవి ఇవ్వడం పై ఆ ఇద్దరు మంత్రులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను కాదని.. టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఓ జూనియర్ నేతకు రాష్ట్రస్థాయిలో కీలక పదవి ఇవ్వడంపై దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారట. జిల్లాలో చాలా మంది సీనియర్లు ఉండగా.. జూనియర్ కి పదవి ఇవ్వడం ఏంటని ఆయన అధిష్టానాన్ని ప్రశ్నించారట.. సామాజిక న్యాయం కూడా పాటించడం లేదని ఓవర్గానికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని.. సదరు మంత్రి మండిపడ్డారని పార్టీలో చర్చ నడుస్తుంది. మొత్తంగా పదవుల పందారం కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందని ప్రచారం జరుగుతుంది.