ట్రంప్ ప‌ర్య‌ట‌న‌కు మోడీ భారీ హైప్‌.. రీజ‌నేంటి…?

-

అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ భార‌త్‌లో రెండు రోజుల పాటు ప‌ర్య‌టిస్తున్నారు. దీంతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న అన్ని అధికార కార్య‌క్ర‌మాల‌ను బంద్ చేసుకున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా త మ త‌మ అధికారిక విధుల‌ను స‌స్పెండ్ చేసుకున్నారు. సోమ‌, మంగ‌ళ‌వారాలు రెండు రోజులు కూడా ట్రం ప్ ప‌ర్య‌ట‌న‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. అదేస‌మ‌యంలో బంగారు ప‌ళ్లేల్లో భోజ‌నాలు, బంగారు చెంచాలు, క‌త్తులు, వెండి గ్లాసులు వంటివి ఏర్పాటు చేశారు. అదేస‌మ‌యంలో భారీ ఎత్తున విందు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మొత్తం కార్య‌క్ర‌మానికి, ట్రంప్‌ బృందానికి చేస్తున్న ఏర్పాట్ల‌కు మోడీ ప్ర‌భుత్వం దాదాపు 2 వేల కోట్లు కేటాయించిన‌ట్టు చెబుతున్నారు. అయితే, ఇంత‌గా ఇరువురు ఈ ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ స‌రం ఏముంది? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఒక‌టి అమెరికాలో త్వ‌ర‌లోనే అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీం తో అక్క‌డి ప్ర‌వాస భార‌తీయుల‌కు ట్రంప్ ప‌ర్య‌ట‌న ప్ర‌భావం చూప‌నుంది. దీంతో ట్రంప్ ఈ ప‌ర్య‌ట‌నను కీల‌కంగా తీసుకున్నారు. ఇక‌, దేశంలో మోడీ వ్య‌తిరేక వ‌ర్గాలు పెరుగుతున్నాయి.

అదే స‌మ‌యంలో ప్ర‌పంచ‌స్థాయిలో భార‌త విధానం తెలియాల్సిన అవ‌స‌రం ఉంది. దీనికితోడు.. వాణిజ్య ప‌రంగా ప్ర‌పంచ మార్కెట్లో భార‌త్ ఎదుర్కొంటున్న గ‌డ్డు ప‌రిస్థితి తొలిగిపోయేందుకు , ప్ర‌స్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక మంద‌గ‌మ‌న ప‌రిస్థితుల‌ను త‌ట్టుకుని ముందుకు సాగేందుకు కూ డా మోడీ ఈ ట్రంప్ ప‌ర్య‌ట‌నను కీల‌కంగా భావిస్తున్నారు.

త‌న‌ను తాను ఇప్ప‌టి వ‌రకు ఎలా పొగుడుకు న్నార‌నేది ప‌క్క‌న పెట్టి ట్రంప్ వంటి అగ్ర‌రాజ్య అధినేత‌తో పొగిడించుకోవ‌డం కోసం మోడీ తాప‌త్ర‌య ప‌డుతున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. వాటిని ప‌క్క‌న పెట్టి ట్రంప్‌కు ప్రాధాన్యం పెంచార‌ని అంటున్నారు. సోమ‌, మంగ‌ళ‌వారాలు దేశ‌వ్యాప్తంగా మీడియాను కూడా మోడీ మేనేజ్ చేసిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి మోడీ వ్యూమం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version