డ‌బుల్ ఇంజినా లేదా ట్రుబ‌ల్ ఇంజినా..? : గుజ‌రాత్ ప‌వ‌ర్ హాలిడే పై మంత్రి కేటీఆర్ ట్వీట్

-

గుజ‌రాత్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ త‌న దైన శైలీలో విమ‌ర్శ‌లు చేస్తు.. ట్వీట్ చేశాడు. గుజ‌రాత్ రాష్ట్రంలో క‌రెంట్ క‌ష్టాలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో గుజ‌రాత్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వారంలో ఒక రోజు ప‌వ‌ర్ హాలిడే ఉటుంద‌ని ఇటీవల గుజ‌రాత్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించాడు.

ట్విట్ట‌ర్ లో గుజ‌రాత్ ప్ర‌భుత్వం జారీ చేసిన ప‌వ‌ర్ హాలిడే కు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను ఫోస్టు చేశారు. అంతే కాకుండా. శ‌క్తి వంత‌మైన వ్య‌క్తులు వ‌చ్చిన గుజ‌రాత్ రాష్ట్రంలో ప‌వ‌ర్ హాలీడే నా.. అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గుజ‌రాత్ లో ఉంది.. డ‌బుల్ ఇంజినా.. లేదా ట్ర‌బుల్ ఇంజినా.. అంటూ మంత్రి కేటీఆర్ రాసుకొచ్చారు. అయితే ఇటీవ‌ల బీజేపీ ప్ర‌భుత్వంపై డబుల్ ఇంజిన్, ట్రబుల్ ఇంజిన్ పై సీఎం కేసీఆర్ కూడా కామెంట్ చేశారు. తాజా గా మంత్రి కేటీఆర్ కూడా ట్రబుల్ ఇంజిన్ అని విమ‌ర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news