కరోనా వైరస్ వల్ల ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిపోయింది. భయంకరమైన ఈ వైరస్ కి మందు లేకపోవడంతో ప్రపంచ దేశాలు అన్నీ లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. దీంతో చాలా దేశాలలో ఆర్థికమాంద్యం నెలకొన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు ఎవరు ఉద్యోగాలకి వెళ్లలేని నేపథ్యంలో అన్ని రంగాలు మూతపడటంతో పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. కోవిడ్-19 నేపథ్యంలో లాక్ డౌన్ లో ఉన్న దేశాలు ఒక్కసారిగా ఎత్తేస్తే ప్రపంచంలో చాలా సంచలన మార్పులు రాబోతున్నాయి అని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమా హాలు అలాగే పబ్బులు, పార్కులు సినిమా ఆడియో వేడుకలు… బహిరంగ రాజకీయ సమావేశాలు ఇలాంటివి బంద్ అయిపోతాయి. ప్రస్తుతం ఇంట్లో ఉన్న మానవుడు లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత గతంలో లాగా కాకుండా తనని తాను కాపాడుకునే విధంగా భయంగా అనుమానంగా బతికే పరిస్థితి కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో దాపురించింది అని సంచలన మార్పు ప్రపంచంలో వచ్చిందని చాలా మంది మేధావులు అంటున్నారు. ఒకవేళ కరెన్సీ నోట్ల ద్వారా కూడా వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉందని భావిస్తే కరెన్సీ ఆపేస్తారు. ఆ టైంలో ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ప్రపంచంలో అమ్మకాలు కొనుగోలు జరుగుతాయని అంటున్నారు.