మునుగోడు ‘కారు’దే..బండ్ల జోస్యం నిజమవుతుందా!

-

మళ్ళీ బండ్ల గణేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇప్పటికే బండ్ల అంటే ఎంత సంచలనమో అందరికీ  తెలిసిందే. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందని, ఇంకా మంత్రి అయిపోతానని, ప్రమాణ స్వీకారం కూడా ప్రాక్టీస్ చేయడం, అలాగే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానని హడావిడి చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడంతో బండ్ల మళ్ళీ రాజకీయాల గురించి ఎత్తలేదు.

కాకపోతే అప్పుడప్పుడు మాత్రం పవన్ సీఎం అవ్వాలని కోరుకుంటూ వస్తున్నారు. ఇక తాజాగా ఏపీ మంత్రులు..పవన్ పై చేస్తున్న వ్యాఖ్యలని ఖండించారు…అంబటి రాంబాబుపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇక చంద్రబాబు-పవన్ కలిసి పోటీ చేస్తే తప్పు ఏంటి అని మాట్లాడి…టీడీపీ-జనసేన పొత్తుని సమర్ధించారు. అలాగే తెలంగాణ రాజకీయాలపై కూడా బండ్ల గణేశ్ కామెంట్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందని కితాబు ఇచ్చారు. హైదరాబాద్ ని…సింగపూర్, దుబాయ్ కంటే ఎక్కువగా అభివృద్ధి చేశారని అన్నారు.

అలాగే మునుగోడు ఉపఎన్నికపై కూడా బండ్ల కామెంట్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ పార్టీకి పునర్జన్మను ఇచ్చే ఎన్నిక అని, మునుగోడులో బీజేపీకి మూడో స్థానమేనని.. ఆ పార్టీని ప్రజలు తరమికొడతారని, అక్కడ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. అంటే బండ్ల జోస్యం ప్రకారం మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతున్నారు.

అయితే బండ్ల జోస్యం చూస్తుంటే…ఇది కూడా బ్లేడుతో గొంతు కోసుకుంటా అనే సవాల్ మాదిరిగానే ఉంది. ఎందుకంటే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోయింది..అదే సమయంలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉంది..ఇటు బీజేపీ బలం ఎప్పటికప్పుడు పెరుగుతుంది. మరి ఇలాంటి పరిస్తితుల్లో మునుగోడు ఉపఎన్నిక చాలా టఫ్ గా ఉంది…కానీ బండ్ల మాత్రం టీఆర్ఎస్ గెలుస్తుందని అంటున్నారు. మరి చూడాలి బండ్ల జోస్యం నిజమవుతుందో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version