జనసేన నేత నాగబాబు చెంప చెళ్లుమనిపించిoది ఎన్నికల సంఘం.సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన పోస్ట్ పై ఈసీ సీరియస్ గా స్పందించింది.ఎన్నికల గురించి మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించింది. ఎన్నికల సంఘం ఆయన పట్ల అంత సీరియస్ ఎందుకు అయింది… అసలు ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఏమి పోస్ట్ చేశారో చూద్దాం…
అసలు నాగబాబు ఏమన్నారంటే….12న అర్ధరాత్రి నుంచి ఇంటింటికీ డబ్బులు పంచుతూ ఓటర్ల వేళ్లపై ముందే సిరా గుర్తు వేసేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.ఈమేరకు తనకు విశ్వసనీయమైన సమాచారం ఉందంటూ నాగబాబు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ కుట్ర అమలు చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. ఓటర్లకు డబ్బులు ఇవ్వడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ నాగబాబు ఆరోపించారు.
ఓటుకు పదివేలు, ఇరవై వేలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. వైసీపీ గూండాలు ఇచ్చే డబ్బులు తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం.. కానీ ఓటు హక్కు మాత్రం తప్పకుండా వినియోగించుకోవాలని నాగబాబు ఓటర్లకు సూచించారు. ఓటేయకుండా అడ్డుకోవడం అంటే మిమ్మల్ని చంపేయడమేనని, మీ ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని చెప్పారు.అయితే నాగబాబు పోస్ట్ పట్ల ఎన్నికల సంఘం అంతే సీరియస్ గా స్పందించింది.వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దని సూచించింది. వేలిపై సిరాచుక్క వేయడం అంటే ఓటుహక్కు వినియోగించుకున్నట్టు. అయితే ఓటు వేయకుండానే సిరాచుక్క వేస్తారు అని నాగబాబు ఆరోపించడం పట్ల ఈసీ సీరియస్ అయింది.మరోసారి ఇలాంటి పోస్టు లు పెట్టవద్దని చెప్పింది.