కేంద్రం ప్రభుత్వం అమలు చేయాలను కుంటున్న విద్యుత్ చట్టాల నిర్ణయాలను తక్షణమే ఉపసంహరించు కోవాలని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ డిమాండ్ చేశాడు. వ్యవసాయ క్షేత్రాల వద్ద మీటర్లు బిగుంచుడం అనేది ముర్ఖమైన చర్య అని విమర్శించారు. ఈ విషయాన్ని కేంద్రం రాష్ట్రాల పై రుద్దు తుందని అన్నారు. రాష్ట్రాలకు కూడా కొన్ని హక్కులు ఉంటాయని గుర్తు చేశారు. ఈ విద్యుత్ చట్టాల విషయం పై తమ పార్టీ ఎంపీ లు కూడా పార్లమెంట్ ఉభయ సభ లో వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.
అలాగే తెలంగాణ లో 24 గంటల పాటు ఉచిత కరెంటు అందిస్తున్నామని తెలిపారు. ఇలాంటి పరిస్థితులలో మీటర్లు పెట్టి ఛార్జీ లు వసూల్ చేయడాన్ని తాను వ్యతిరేకిస్తున్నాని కేసీఆర్ తెలిపారు. కాగ తెలంగాణ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కూడా రైతులకు ఉచిత కరెంటు అందిస్తున్నారని అన్నారు. వారు కూడా ఈ విద్యుత్ చట్టాలను వ్యతిరే కిస్తారని అన్నారు.