హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలని మొత్తం హరీష్ రావు చూసుకున్న సంగతి తెలిసిందే. ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీష్…హుజూరాబాద్‌లో కూడా పార్టీని గెలిపించేస్తారని అంతా అనుకున్నారు. కానీ సీన్ పూర్తిగా రివర్స్ అయింది…ఈటల రాజేందర్ మంచి మెజారిటీతో గెలిచేశారు. అయితే హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత హరీష్ బాగా నెగిటివ్ అయ్యారనే చెప్పాలి.
అయితే కుట్రలు చేయడం వల్ల హరీష్ బాగా నెగిటివ్ అవుతున్నారు. ఈటల సైతం హరీష్ కుట్రల గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికలు జరిగే చోట ఇంచార్జ్‌గా ఉంటూ, సిద్దిపేట లాగా అభివృద్ధి చేస్తా, ఆ మండలాలని దత్తత తీసుకుంటా, ఈ గ్రామాలని దత్తత తీసుకుంటా అని ప్రజలను మోసం చేస్తున్నారని, కానీ హరీష్‌కు హుజూరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పారని ఈటల ఫైర్ అవుతున్నారు. హరీష్ అబద్దాల కోరులాగా తయారయ్యాడని అన్నారు. అలాగే సిద్ధిపేటలో దళితగర్జన నిర్వహిస్తానని ఈటల సవాల్ చేశారు.
అయితే అందరూ హరీష్‌నే టార్గెట్ చేస్తున్నారు..ఇదే కేసీఆర్‌కు కూడా కావాల్సింది…ఈ పోరులో తెలివిగా తన తనయుడు కేటీఆర్‌ని సైడ్ చేశారు. అసలు కేటీఆర్ హుజూరాబాద్ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోలేదు. ఏదో ట్వీట్లలో తప్ప, డైరక్ట్‌గా హుజూరాబాద్ జోలికి పోలేదు. అంటే ఓటమి ఎఫెక్ట్ తనపై పడకుండా కేటీఆర్ బాగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇప్పుడు ప్రతి అంశలోనూ హరీష్ బుక్ అవుతున్నారు తప్ప…కేటీఆర్ టాపిక్ రావడం లేదు..ఈటల సైతం కేటీఆర్ ప్రస్తావన తీసుకురావడం లేదు. అంటే కేటీఆర్ ఎంత తెలివిగా సైడ్ అయ్యారో అర్ధమవుతుంది.