Swetha Varma: ఛాన్స్ ఇస్తాం.. కమిట్‌మెంట్ ఇస్తారా..” : క్యాస్టింగ్ కౌచ్ పై బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

-

Swetha Varma: సినీ ఇండ‌స్ట్రీలో తరచుగా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. సినీ రంగుల ప్రపంచంలోకి
ఎన్నో క‌ల‌లు కంటూ వ‌చ్చే.. నూత‌న యాక్టెర్స్ కు కాస్టింగ్ కౌచ్ శాపంగా మారుతోంది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ బాధితులు చాలామందే ఉంటారు. కొంతమంది తెర వెనుక బాగోతాలను బయటపెడితే మరికొంతమంది చప్పుడు కాకుండా.. ఉంటుంటే.. మ‌రికొందరు నటీమణులు ఈ కాస్టింగ్ కౌచ్ ని ధైర్యంగా ఎదుర్కొని రాణిస్తున్నారు.

తాజాగా.. క్యాస్టింగ్ కౌచ్ పై బిగ్ బాస్ హౌస్ శ్వేతా వర్మ. హౌస్ లో స్ట్రాంగ్ కటెస్టెంట్‌గా కంటిన్యూ అయిన శ్వేత.. అనూహ్యంగా ఆరోవారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది శ్వేతా వర్మ. బిగ్ బాస్ తో మంచి ఇమేజ్ ని సంపాదించుకుంది. వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీ బిజీ అవుతుంది.

తాజాగా శ్వేతవర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేన‌ని చెప్పుకొచ్చింది. తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయట పెట్టింది. గతంలో క్యాస్టింగ్ కౌచ్‌పై కుండబద్దలు కొట్టినట్టు తెరవెనుక బాగోతాలను బటయపెట్టింది శ్వేతా వర్మ.

టాలీవుడ్‌లో 99 % ఫిమెల్ యాక్ట‌ర్స్ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్న వారేని.. తాను కూడా ఫేస్ చేశాన‌ని అన్నారు. ఛాన్స్ ఇస్తాం కమిట్‌మెంట్ ఇస్తారా అంటూ చాలా అస‌భ్య‌క‌రంగా మాట్లాడార‌ని, రెమ్యునరేషన్ ఎంతైనా ఇస్తాం.. మాకు సహకరించాలని అడిగార‌ని ఓపెన్ అయ్యింది. ఒక‌సారి.. ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి ఓ యాడ్ షూటింగ్ ఉంది, రెమ్యునరేషన్ లక్ష రూపాయల వరకు ఇస్తాం.. కానీ తమకు సహకరించాలని అడిగాడు.

2015లో యాడ్స్ కోసం ఓ డైరెక్టర్ న‌న్ను అప్రోజ్ అయ్యాడు. డేకి రూ.1 లక్ష ఇస్తాం.. కాకపోతే డైరెక్టర్‌కి కమిట్‌మెంట్ ఇవ్వాలని అడిగాడు. ఆ మాట‌లతో నాకు కోపం వ‌చ్చింది. నాకు లక్ష రూపాయలు ఇస్తే నేను కమిట్ మెంట్ ఇవ్వాలంటున్నారు.. మరి నేను ఎతైన బిల్డింగ్ మీద నుంచి దూకమంటా.. దూకుతారా..? అని ప్రశ్నించా.. దాంతో అవతలి వ్యక్తి సైలెంట్ అయ్యాడు.

సినిమాలు, యాడ్స్ ఇలాంటి సందర్భాల్లో కమిట్స్‌మెంట్స్ అడుగుతారని రంగుల ప్ర‌పంచం లోని నీలినీడ‌ల‌ను బ‌య‌ట‌పెట్టింది. త‌న‌కు బిగ్ బాస్ మంచి ప్లాట్ ఫామ్ ఇచ్చింద‌నీ, ఇప్పుడు పలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో ఛాన్స్‌లు వస్తున్నాయి అని తెలిపింది శ్వేతవర్మ. ద రోజ్‌ విల్లా, ముగ్గురు మొనగాళ్లు, పచ్చీస్‌, సైకిల్‌ వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలతో ఆమెకు స‌రైనా పేరు రాలేదు. సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌లు, పలు యాడ్స్‌లో నటించింది శ్వేతా వర్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version