యుద్దంలో పోరాడేందుకు తెలంగాణ బిజేపీకి బలమైన క్యాడరుంది.. సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు అవకాశాలూ ఉన్నాయి.. గత ఎన్నికల్లో బలమైన ఓటు షేర్ సాధించి.. తెలంగాణాలో తామే ప్రత్యామ్నాయ పార్టీ అని నేతలు చెబుతున్నారు.. మరింత బలోపేతం అవ్వాలని చూస్తున్న ఆ పార్టీకి త్వరలో నూతన అధ్యక్షులు రాబోతున్నారు..
తెలంగాణాలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న బిజేపీ.. కొత్త అధ్యక్షుడిని నియమించే కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాషాయ దళపతి అయ్యేందుకు నలుగురు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారట. తనకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తే పార్టీని పవర్ లోకి తెస్తానంటూ కేంద్రం పెద్దల వద్ద చెబుతున్నారట.. అయితే అధిష్టానం మాత్రం.. సరైన టైమ్ లో.. సరైన నేతకు పగ్గాలు అప్పగించాలని యోచిస్తోందన్న టాక్ కమలం పార్టీ నుంచి వినిపిస్తోంది..
సంస్థాగత ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ పెట్టింది. బూత్ స్థాయి నుంచి మొదలుకుని రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడి వరకు ఎన్నికల ప్రక్రియ ద్వారా నియామకం జరగనుంది. డిసెంబర్ నెలాఖరున రాష్ట్ర అధ్యక్ష పదవికి, జనవరిలో జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగే అవకాశముంది. ఈ క్రమంలో తెలంగాణ బిజేపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది.. అయితే దీనిపై అధిష్టానం ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చిందన్న ప్రచారం డిల్లీ స్థాయిలో జరుగుతోంది..
మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. బండి సంజయ్ ని అధ్యక్షుడిగా తప్పించి.. కిషన్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చే సమయంలోనే ఈటల ప్రెసిడెంట్ అవుతారని చర్చ జరిగింది. కానీ అది వర్కౌట్ అవ్వలేదు.. అయితే ఈసారి ఈటల రాజేందర్ ని అధ్యక్షున్ని చేసి.. బీసీ నేతకు అవకాశం ఇచ్చామని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిజేపీ భావిస్తోందట..
సమర్దవంతమైన నేతగా.. రాజకీయాల్లో అపర చాణుక్యునిగా పేరున్న ఆయనకి బాధ్యతలు ఇచ్చి.. వచ్చె ఎన్నిల్లో అధికారంలోకి రావాలని కమలం పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.. తెలంగాణలో అత్యధిక బీసీ జనాబా ఉండటంతో.. బీసీకార్డు కలిసొచ్చే అంశమని.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సత్తా ఈటెలకే ఉందన్న అభిప్రాయంలో డిల్లీ పెద్దాలు ఉన్నారట.. డిసెంబర్ చివరిలో ఆయన బాధ్యతలు అప్పగించే అవకాశముంటుందని తెలంగాణ సీనియర్లు చర్చించుకుంటున్నారు.. తెలుస్తోంది.