తెలంగాణ బిజేపీ ఛీప్ నియామకంపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఆయనకే ఛాన్స్ వరించబోతుందా..?

-

తెలంగాణ రాష్టం ఏర్పాటుకు బిజేపీ ఓటేసింది.. పార్లమెంట్ లో బిల్లు పెట్టిన సమయంలో మద్దతు ప్రకటించింది.. ఈ రాష్టంలో పాగా వేసేందుకు పావులు కదిపినా.. కాంగ్రెస్ కు, బిజేపీకి ఆ అవకాశం దక్కలేదు.. పోరాటం పేరుతో బిఆర్ఎస్ తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.. అప్పటి నుంచి తెలంగాణాలో బలపడేందుకు కమలం పార్టీ అగ్రనేతలు పావులు కదుపుతూనే ఉన్నారు..

ప్రతి ఎన్నికలో గణనీయమైన ఓటు షేర్ పెంచుకుంటున్న ఆ పార్టీ.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది.. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. క్రమంగా బలపడుతోంది.. ఈ క్రమంలోనే బీసీ ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టింది.. బీసీ నేతకు బిజేపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని అగ్రనేతలు ఆలోచిస్తున్నారట..

తెలంగాణ అధ్యక్షునిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు.. ఆయన పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టలేకపోతున్నానని.. వేరేవారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని ఇప్పటికే డిల్లీ పెద్లలను కోరారు..దీంతో బీసీ సామాజికవర్గానికి చెందిన బీసీ నేత కోసం బిజేపీ అన్వేషణ మొదలుపెట్టింది.. పార్టీలో యాక్టివ్ గా ఉంటున్న ఈటెల రాజేందర్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.. సీనియర్ నేత కావడం.. ఉద్యమ నేతగా.. బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న ఆయనకు రాష్టంపై పూర్తి స్థాయిలో అవగాహన, పట్టు ఉంది.. ఈ క్రమంలో ఆయనికి పదవి ఇస్తే పార్టీ బలోపేతం అవుతుందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారట..

వచ్చె ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను ఈటెలకు అప్పగించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.. అధ్యక్ష పదవి కట్టబెట్టి.. పుల్ పవర్స్ ఇవ్వడం ద్వారా ఈటెలకు దూసుకెళ్తారని.. పార్టీని బలోపేతం చెయ్యడంతో పాటు.. క్యాడర్ ను ఏకం చేస్తారని అగ్రనేతలు ఆలోచిస్తున్నారట.. మరోపక్క అధ్యక్ష పదవి కోసం చాలా మంది బరిలో ఉన్నా.. ఈటెలకు ఖరారు అయ్యే ఛాన్స్ ఉందని.. తెలంగాణ బిజేపీలో ప్రచారం జోరందుకుంది.. ఈ నెలాఖరులోపు పదవిని అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version