రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం వెలువడుతుంది. బీజేపీ తరుపున ఈటల రాజేందర్…టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ హోరాహోరీగా తలపడ్డారు. ఇక ఉపఎన్నిక ఫలితంలో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికార టీఆర్ఎస్‌కు ఆధిక్యం లభించింది. పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కు 503, బీజేపీ 159, కాంగ్రెస్ 32, చెల్లనవి 14గా ఉన్నాయి. మొత్తంగా పోస్టల్‌బ్యాలెట్‌లలో టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించింది.
ఇక బద్వేలు ఉపఎన్నికలో ఫ్యాన్ హవా నడుస్తోంది. అధికార వైసీపీ భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. నాలుగో రౌండ్ ముగిసే సరికి 30,412 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ కొనసాగుతోంది. మొత్తానికి చూసుకుంటే హుజూరాబాద్‌లో ఈటల లీడ్‌లో ఉండగా, బద్వేలులో వైసీపీ భారీ విజయం దిశగా ముందుకెళుతుంది. అయితే ఇప్పుడే హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎవరు ఖచ్చితంగా గెలుస్తారనే విషయం క్లారిటీ రావడం లేదు.