ఎన్డీఏ కూటమివైపే ఎగ్జిట్ పోల్స్.. మరోసారి ఇండియా కూటమికి భంగపాటు తప్పదా..?

-

విమర్శలు.. ప్రతి విమర్శలతో పొలిటికల్ హీట్ పెంచేసిన మహారాష్ట, జార్ఖండ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.. ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.. తమ పార్టీనే అధికారంలోకి రాబోతుందంటూ కాన్పిడెంట్ గా చెబుతున్నారు.. కానీ ఎక్కడో డౌట్ పార్టీలను తడుతోంది..దీంతో అందరూ ఎగ్జిట్ పోల్స్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు.. లెక్కలేసుకుంటున్నారు.. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి..?

మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముసిగిన వెంటనే.. ఎగ్జిట్ పోల్ మీదే అందరి దృష్టి పడింది.. మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్‌లో మహారాష్ట్ర, జార్ఖండ్‌ల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికే ఎక్కువ విజయావకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది.. మహారాష్ట్రలో 288 సీట్ల అసెంబ్లీకి ఒకే దశలో పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో 4,136 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మహాకూటమిలో భాగమైన బీజేపీ 149 స్థానాల్లో, శివసేన 81 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేసింది.

ప్రతిపక్ష వికాస్ అఘాడియా కూటమిలో కాంగ్రెస్ 101 మంది అభ్యర్థులను, శివసేన (యుబిటి) 95 మంది అభ్యర్థులను, ఎన్‌సిపి (శరద్‌చంద్ర పవార్) 86 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి), ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ (ఎఐఎంఐఎం)తో సహా చిన్న పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు దశల్లో పోలింగ్‌ జరిగింది. తొలి దశలో 43 స్థానాలకు పోలింగ్‌ జరిగింది.

ఫలితాల కోసం ప్రధాన పార్టీలు, అభ్యర్దులు నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్న వేళ.. మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ పైనే అందరి చర్చా జరుగుతోంది.. ఈ ఎగ్జిట్ పోల్‌లో బీజేపీ కూటమికి 150-170 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 110-130 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 8 నుంచి 10 సీట్లు రావచ్చని పేర్కొంది. ఇక, మహారాష్ట్రలో మహాయుతి (ఎన్డీఏ)కి 225 సీట్లు వస్తాయని కేకే సర్వే అంచనా వేసింది. గత ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కేకే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడించిన ఫలితాలే దగ్గర ఉన్న సంగతి తెలిసిందే!

తాము చెప్పినట్లుగానే మహారాష్టలో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని మహాయుతి నేతలు స్పష్టం చేస్తున్నారు.. తాము చేసిన అభివృద్ది ,సంక్షేమ పథకాలే తమను గెలిపించబోతున్నాయని.. వికాస్ అఘాడియాను కోలుకోలేని దెబ్బతీయబోతున్నామని నేతలు ప్రకటిస్తున్నారు.. జార్ఖండ్ లో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని.. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్న నేపథ్యంలో.. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news