తెలంగాణ విమోచన వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య

-

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లి అసెంబ్లీ చౌరస్తాలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సెప్టెంబర్ 17 చరిత్రాత్మక రోజు అని వెంకయ్య అన్నారు. ఈరోజును వివాదాల్లేకుండా వేడుక జరుపుకోవాలని సూచించారు.

కుల, మత బేధాల్లేకుండా జాతి సమైక్యత కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని వెంకయ్యనాయుడు తెలిపారు. వెంకయ్యనాయుడుతోపాటు ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావు పాల్గొన్నారు. వారంతా కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించారు.

మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పాల్గొన్నారు. కార్యాలయ ప్రాంగణంలో బండి సంజయ్ జాతీయ జెండా ఎగురవేశారు. పటేల్ సాహసోపేత నిర్ణయం వల్ల హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని.. ఈ సందర్భంగా జరుపుతున్న వేడుకలకు అభినవ పటేల్ కేంద్రహోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా వచ్చారని బండి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version