టీడీపీలో గల్లా ఫ్యామిలీ గల్లంతు..ప్లాన్ మారుస్తారా?

-

ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పిన గల్లా ఫ్యామిలీ ఇప్పుడు అడ్రెస్ లేదు. టి‌డి‌పిలో గల్లా ఫ్యామిలీ అసలు కనిపించడం లేదు. రాజకీయాలపై విరక్తి చెంది దూరంగా ఉంటున్నారా? లేక వైసీపీ అధికారంలో ఉందని సైలెంట్ గా ఉంటున్నారా? లేదా టి‌డి‌పి నుంచి జంప్ అవ్వాలని చూస్తున్నారా? అనేది తెలియడం లేదు. గల్లా అరుణ కుమారి ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ లో సత్తా చాటిన నాయకురాలు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరవేశారు.

ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో గల్లా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీని వదిలేసి..టి‌డి‌పిలోకి వచ్చేశారు. 2014 ఎన్నికల్లో గల్లా అరుణ కుమారి..చంద్రగిరి నుంచి, గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా పోటీ చేశారు. ఇక అరుణ కుమారి ఓడిపోగా, జయదేవ్ గెలిచారు. ఇక తర్వాత అరుణ నిదానంగా రాజకీయాలకు దూరమయ్యారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి అరుణ పోటీకి దూరంగా ఉన్నారు. మళ్ళీ జయదేవ్ గుంటూరు ఎంపీగా పోటీ చేశారు. అక్కడ అమరావతి ప్రభావం, అంతకముందు గల్లా పార్లమెంట్ లో తన గళాన్ని బలంగా వినిపించడం, తన బావ మహేశ్ బాబు సపోర్ట్ ఉండటంతో గల్లా  మళ్ళీ గెలిచారు.

కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో గల్లా ఫ్యామిలీ సైలెంట్ అయింది. జయదేవ్ అప్పుడప్పుడు పార్లమెంట్ లో కనబడటం తప్ప..రాజకీయంగా ఏపీలో కనిపించలేదు. టి‌డి‌పిలో యాక్టివ్ గా లేరు. గుంటూరు టి‌డి‌పి పార్టీ ఆఫీసులో కనిపించలేదు. దీంతో గల్లా ఫ్యామిలీ రాజకీయాలకు దూరం అవుతుందనే ప్రచారం వచ్చింది.

ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో గల్లా ఫ్యామిలీ మళ్ళీ యాక్టివ్ అవుతుందని తెలిసింది. అయితే చంద్రబాబు ఒక సీటు ఇవ్వడానికే రెడీగా ఉన్నట్లు సమాచారం. మళ్ళీ గల్లాకు గుంటూరు ఎంపీ సీటు దక్కే ఛాన్స్ ఉంది. మరి అరుణ కుమారి సైతం సీటు అడిగితే అప్పుడు బాబు..చంద్రగిరి ఇవ్వడానికి రెడీ అవుతారా? అనేది చూడాలి. అయితే ఇప్పటికే అక్కడ పులివర్తి నానిని అభ్యర్ధిగా ప్రకటించారు. చూడాలి మరి ఈ సారి గల్లా ఫ్యామిలీ రాజకీయం ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version