షాకింగ్: మంత్రి సూసైడ్….కరోనా కల్లోలమే కారణమట!!

-

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని 200 పైగా దేశాలు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటుండగామరోపక్క ప్రపంచ వ్యాప్తంగా 30 వేల మంది ఈ కరోనా వల్ల మృతి చెందారు. అంతేకాకుండా దాదాపు 7 లక్షల మంది ఈ కరోనా పాజిటివ్ రావడం తో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంతటి అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ కారణంగా జర్మనీ ఆర్ధిక మంత్రి థామస్ షెఫర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వైరస్ ఆయనకు సోకి ఆత్మహత్య చేసుకున్నారు అని భావిస్తే అది తప్పు. కేవలం కోవిడ్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనతోనే 54 ఏళ్ల థామస్ సూసైడ్ చేసుకున్నారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. గ‌త రెండు ద‌శాబ్దాలు నుంచి పాలిటిక్స్ లో రాణిస్తున్న ఆయ‌న..దాదాపు 10 సంవ‌త్స‌రాలుగా ఆర్థిక మంత్రిగా సేవ‌లు అందిస్తున్నారు. అయితే సూసైడ్ కు ముందు థామ‌స్ సూసైడ్ లెట‌ర్ రాసినట్టు స‌మాచారం. క‌రోనా నేప‌థ్యంలో మంత్రి ఇటీవ‌ల ప్ర‌జ‌ల్లో క‌లియ‌తిరిగారు. కోవిడ్ వ‌ల్ల ఆర్థిక సంక్షోభం రావొచ్చ‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు స‌మాచారం అందించారు. థామ‌స్ జ‌ర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు చెందిన క్రిస్టియన్ డెమొక్రాట్స్ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ప్రళయం నేపథ్యంలో మంత్రి సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. హొచీమ్ సిటీ లో ఆయన డెడ్ బాడీ ని హైస్పీడ్ రైల్వే లైన్ పై శనివారం గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి వివరాలను బయటకు చెప్పకుండా పోలీసులు గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version