టిడిపికి మాజీ ఎమ్మెల్యే గుడ్ బై..? ఏ పార్టీలో చేరతారంటే..??

-

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ టిడిపికి త్వరలో గట్టి షాక్ తగలబోతుందని ప్రచారం జరుగుతుంది.. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా బరిలో దిగిన అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తుంది.. గత వారం రోజుల నుంచి ఆయన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.. కావలి టిడిపి టికెట్ ఈసారి బడా పారిశ్రామికత కావ్య కృష్ణారెడ్డికి టిడిపి అధిష్టానం కేటాయించింది.. దీంతో ఆయన పార్టీ వీడుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

అల్లూరు నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గత ఎన్నికల సమయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరారు.. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన అనంతరం ఆయన్ని తెలుగుదేశం పార్టీ దూరం పెట్టింది.. అప్పటి నుంచైనా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.. మత్స్యకార గ్రామాల్లో బలమైన ఓటు బ్యాంకు కలిగిన విష్ణువర్ధన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ దూరం పెట్టడంతో ఆయన వర్గం తీవ్ర అసంతృప్తి ఉంది.. టికెట్ కూడా కేటాయించకపోవడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి త్వరలో మరో పార్టీలో చేరిపోతున్నారనే ప్రచారం ఊపు అందుకుంది.. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు గల్లంతయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. కావ్య కృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని నచ్చని టిడిపి నేతలు సైతం విష్ణువర్ధన్ రెడ్డికి టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version