టికెట్ రాకపోవడంతో కంటతడి పెట్టిన టిడిపి మాజీ ఎమ్మెల్యే.. బ్రోకర్లకు టికెట్ ఇచ్చారంటూ ఫైర్..

-

టిడిపిలో సీనియర్లకు ప్రాధాన్యత లేదని మరోసారి స్పష్టమైంది.. నెల్లూరు జిల్లా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన వర్గం నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ కు టికెట్ ఇవ్వడం పట్ల మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అధిష్టానం తీరుపై తీవ్ర అగ్రహాంతో ఉన్నారట.. కార్యకర్తలు, ముఖ్య నేతలతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు కలిగిరిలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని పలు సంచల వ్యాఖ్యలు చేశారని పార్టీలో చర్చ నడుస్తుంది.

 

14 ఏళ్ల పాటు ఉదయగిరి నియోజకవర్గం ఇన్చార్జిగా పనిచేశానని.. ఎన్నికల సమయంలో చంద్రబాబు తనకు వెన్నుపోటు పొడిచారని బొల్లినేని రామారావు వ్యాఖ్యానించారట. తెలుగుదేశం పార్టీలో బ్రోకర్లకు మాత్రమే టికెట్లు వస్తాయంటూ అభ్యర్థి కాకర్ల సురేష్ ని ఉద్దేశించి మాట్లాడినట్లు ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. టిక్కెట్ విషయంపై కార్యకర్తల అభిప్రాయాలను చంద్రబాబుకు తెలియజేస్తానని.. ఆయన నిర్ణయం పై తన రాజకీయ కార్యాచరణ ఉంటుందని రామారావు అంతర్గత సమావేశాల్లో చెపుతున్నారట.. కాకర్ల సురేష్ లాంటి జూనియర్లకు టిడిపి అధిష్టానం టిక్కెట్ ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు సైతం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట.. వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని కొట్టాలంటే కాకర్ల సురేష్ సరిపోరని.. పార్టీలో చర్చ నడుస్తుంది..

టిడిపిలో జరుగుతున్న పరిణామాలని అధికార పార్టీ నిషితంగా గమనిస్తుంది.. బొల్లినేని రామారావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే టిడిపి ఓటు బ్యాంక్ భారీగా చీలిపోయే అవకాశం ఉందని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే తమకు లాభిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా కాకర్ల సురేష్ కు బొల్లినేని రామారావు తలనొప్పిగా మారారని కాకర్ల వర్గం విమర్శిస్తోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version