ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీ నేలకూలుతుంది : గులాంనబీ ఆజాద్

-

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్ తరచూ ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. హస్తం పార్టీలో చాలా మంది నేతలు నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు రాహుల్ గాంధీపై, గాంధీ కుటుంబంపై విరుచుకుపడ్డ ఆజాద్ తాజాగా మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. తాను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసినప్పటి నుంచే పార్టీలో తనను టార్గెట్​ చేశారన్నారు. ఇప్పుడు తన రాజీనామాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సాకుగా చూపుతున్నారన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బలవంతంగా బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు

“కాంగ్రెస్‌లోని కొందరు స్వార్థపరులు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఎందుకంటే తమకు ఎవ్వరూ లేఖలు రాయకూడదని, ఎవ్వరూ ప్రశ్నించకూడదని వారు అనుకున్నారు. పార్టీలో అనేక సమావేశాలు జరిగాయి, కానీ వాళ్లు ఒక్క సూచన కూడా తీసుకోలేదు” అని ఆజాద్ పేర్కొన్నారు.

కాంగ్రెస్​కు ఔషధాలు అవసరమని, అయితే వాటిని డాక్టర్​కు బదులుగా కాంపౌండర్లు ఇస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆజాద్. పార్టీ పునాదులు చాలా బలహీనపడ్డాయని, ఏ క్షణమైనా వ్యవస్థ మొత్తం శిథిలం కావచ్చని జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version