బ్రేకింగ్: ఏపీ సర్కార్ కి షాక్ ఇచ్చిన హైకోర్ట్

-

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర సర్కార్ తీరుపై ఇప్పుడు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ సర్కార్ కి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణపై స్టే ఇవ్వలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఎస్‍ఈసీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఎన్నికల నిర్వహణపై అధికారం ఎస్‍ఈసీకి ఉంటుంది అని స్పష్టం చేసింది. ఎన్నికలు ఆపాలంటూ ప్రభుత్వం కోర్టుకు రావడం సరికాదన్న ధర్మాసనం… ఎన్నికల నిర్వహణ విషయంలో తుది నిర్ణయం ఎన్నికల సంఘానిదే అని స్పష్టం చేసింది. ఎస్‍ఈసీ తరపున అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. కరోనాపై వైద్య వర్గాలతో పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపామని ఎస్‍ఈసీ పేర్కొంది. కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలిసాకే దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు నిర్వహిస్తామని కోర్టుకు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version