స్కూల్ స్థలం పోలీస్‌స్టేషన్‌కు ఎలా ఇస్తారు..కలెక్టర్‌కు రఘునందన్ రావు ఫిర్యాదు

-

ప్రభుత్వ హైస్కూల్ కోసం కేటాయించిన స్థలాన్ని పోలీస్‌స్టేషన్‌కు ఇవ్వడం సరికాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ విషయంపై అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి భేటీ అయ్యారు.అనంతరం జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి,ఎస్పీ రూపేష్‌ని కలిసి వినతి పత్రం అందించారు. మెదక్ ఎంపీ మాట్లాడుతూ..అమీన్‌పూర్ పట్టణ పరిధిలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గతంలో ప్రభుత్వ పాఠశాల,మున్సిపల్ కార్యాలయం, ప్రాథమిక ఆస్పత్రి, పోలీస్‌స్టేషన్‌లకు భూమిని కేటాయించిన విషయం తెలిసిందే.

అయితే,ఉన్నపలంగా హై స్కూల్ కోసం కేటాయించిన స్థలాన్నిరద్దుచేసి పీఎస్‌ కోసం కేటాయించడం సరికాదన్నారు.గతంలో పాఠశాలకు స్థలం కేటాయించడం వల్లే స్థానిక ప్రజాప్రతినిధుల విన్నపం మేరకు అమీన్‌పూర్ పరిధిలోని కోకోకోలా పరిశ్రమ సీఎస్ఆర్ నిధులతో హైస్కూల్ నిర్మాణానికి ముందుకు వచ్చిందన్నారు. దీనికి తోడు ఆ పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు సైతం ఆర్థికంగా సాయం అందించి పాఠశాలలో వసతుల కల్పనకు చొరవ చూపారని గుర్తుచేశారు. అయితే, పాఠశాల స్థలంలో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయగా పోలీసులు దాని నిర్మాణాన్ని అడ్డుకోవడమే కాకుండా ఆ భూమి తమదని బోర్డు ఏర్పాటు చేశారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version