పార్టీ నుంచి బ‌య‌టకు వెళ్తే.. ఇండిపెండెంట్ గానే ఉంటా : జ‌గ్గారెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మీడియా స‌మావేశంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ జాగీరు కాదు.. నా జాగీరు కాదు అని అన్నారు. త‌న‌కు కొన్ని స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని వాటిని సోనియా గాంధీని క‌లిసి చెబుతాన‌ని అన్నారు. త‌న స‌మ‌స్య‌లు ఠాగుర్ కు చెప్పాన‌ని అన్నారు. అయితే అవి ప‌రిష్కారం అవడం లేద‌ని అన్నారు. అయితే తాను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాన‌ని అన్నారు. అయితే త‌న వ‌ల్ల ఇబ్బంది అంటే.. అప్పుడు అలోచిస్తాన‌ని అన్నారు. ఏ కార‌ణం నుంచి అయిన తాను కాంగ్రెస్ పార్టీకి దూరం అయితే సోనియా గాంధీ కుటుంబానికి గౌర‌వం గానే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

అయితే తాను ఇత‌ర పార్టీల‌కు వెళ్లే ప్ర‌స‌క్తే లేద‌ని అన్నారు. ఇండిపెండెంట్ గానే ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తాన‌ని తెల్చి చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అని.. అలాంటి పార్టీకి దూరం కావాల‌ని ఎవ‌రూ అనుకోర‌ని అన్నారు. సంక్రాంతి త‌ర్వాత సోనియా గాంధీని క‌లిసిన త‌ర్వాత అన్ని విష‌యాలు చెబుతాన‌ని అన్నారు. అలాగే త‌న నోటికి తాళం వేసే స‌త్త సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌కే ఉంద‌ని అన్నారు. రాష్ట్ర నాయ‌కులకు ఎవ‌రికీ కూడా అది సాధ్యం కాద‌ని అన్నారు. కాగ జ‌గ్గా రెడ్డి వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో పెనూ దుమారం లేపుతున్నాయి.