” ఈ శవం ఎవరిది ? టోకెన్ నెంబర్ ఎంత .. అప్పుడే కాల్చకండి ” ఇదీ ఇటలీ లో పరిస్థితి !

-

కరోనా వైరస్ ప్రభావం ఎంత ప్రమాదకరమో భారతదేశంలో ఉన్న ప్రజలకు సరిగా అర్థం కావటం లేదు. ప్రస్తుతం స్మశానంగా మారిన ఇటలీ దేశంలో ప్రజలు కూడా ఈ విధంగానే చాలా ఎటకారంగా కరోనా వైరస్ విషయంలో వ్యవహరించారు. దేశ ప్రభుత్వాలు అధికారులు ప్రజలకు ఎన్ని సూచనలు మరియు నిబంధనలు హెచ్చరికలు జారీ చేసిన పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు అక్కడ కరోనా వైరస్..భయంకరంగా ప్రబలిపోయింది. దేశంలో చాలా ప్రాంతాలలో మనుషుల శవాలతో నిండిపోయింది. అంతే కాకుండా అక్కడ శవాన్ని పాతి పెట్టడానికి స్థలం కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. మరోపక్క వైరస్ విస్తృతంగా వ్యాపించడంతో రోగులకు చికిత్స చేయడానికి సరిపడా సౌకర్యాలు, మెడికల్ కిట్లు లేకపోవడంతో ఇటలీ తీవ్రంగా సతమతమవుతోంది. దీంతో కరోనా సోకిన వృద్ధులకు చికిత్స చేయలేక అలా వదిలేసే భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కుప్పలుతెప్పలుగా మనిషి వైరస్ తో చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఇటలీ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ విద్యుత్ స్మశాన వాటికల ద్వారా శవాలను కాలుస్తున్నారు. అయితే భయంకరంగా శవాలు రావటం తో ఇటలీ దేశం టోకెన్ నెంబర్ సిస్టం ని ప్రవేశపెట్టింది. సదరు టోకెన్ వచ్చాక ఆ వ్యక్తి యొక్క శవాన్ని తీసుకు రావాలని ఇటలీ యొక్క అధికారులు బంధువులకు తెలియజేస్తున్నారు.

 

అప్పటిదాకా బంధువులు శవాన్ని ఇంటిలో పెట్టాలా బయట పెట్టాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యుత్ శ్మశానవాటిక దగ్గర అధికారులు ” ఈ శవం ఎవరిది ? టోకెన్ నెంబర్ ఎంత .. అప్పుడే కాల్చకండి ” అంటూ ఆదేశాలు ఇస్తున్నారు. ఈ విధంగా ఇటలీ దేశంలో పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి భారత్ లో రాకుండా ఉండాలంటే 21 రోజులు ప్రధాని మోడీ చెప్పినట్లు ఇంటికే పరిమితమైతే మంచి భవిష్యత్తు ఉంటుందని అంతర్జాతీయ స్థాయిలో భారత్ అనుసరిస్తున్న లాక్ డౌన్ పద్ధతిపై కామెంట్లు వస్తున్నాయి. ఏమాత్రం ఇష్టానుసారంగా ప్రజలు వ్యవహరించే పరిస్థితి ఏర్పడిన అత్యంత చిన్న భూభాగం పై ఎక్కువమంది జనసంద్రత కలిగిన దేశం కాబట్టి…మనకి టోకెన్స్ ఏమి ఇవ్వరు, తీసుకెళ్లి గోతిలో పాడేసి కాల్చడం గ్యారెంటీ అనే టాక్ బలంగా వినబడుతుంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version