తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఢిల్లీలో మాట్లాడిన విషయం తెలిసిందే. గవర్నర్ వ్యాఖ్యలపై అధికార, విపక్ష పార్టీలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. తాజా గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా స్పందించారు. హైదరాబాద్ లో మీడియా తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. గవర్నర్ ను సీఎం కేసీఆర్ అవమానిస్తే.. రాజ్యాంగాన్ని అగౌరవ పర్చినట్టే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
గవర్నర్ అంటే.. రాజ్యాంగ వ్యవస్థలో భాగమే అని అన్నారు. అలాగే గవర్నర్ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ లు కలిసి డ్రామా ఆడుతున్నాయని మండిపడ్డారు. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ప్రజలను కన్ఫూజ్ చేస్తున్నారని అన్నారు. కానీ ప్రజలు టీఆర్ఎస్, బీజేపీ ల డ్రామాలను కనిపెడుతున్నారని అన్నారు.
అలాగే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ పార్టీ నాయకులు పని చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ నెల చివర్లో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తమ పార్టీలో భిన్న అభిప్రయాలు ఉన్నాయని అన్నారు. కానీ భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు.