కమలంతో కారు..ఇదేం లెక్క.!

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలలు మాత్రమే సమయం ఉంది..ఇక ఎన్నికల్లో గెలిచే విధంగా కే‌సి‌ఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఈ క్రమంలో దూకుడుగా ఉంటూ అభ్యర్ధులని ప్రకటించేశారు. దీంతో ఎన్నికల రణరంగంలోకి దిగారు. అటు కాంగ్రెస్ సైతం దూకుడుతో ఉంది. అభ్యర్ధులని ప్రకటించే దిశగా వెళుతుంది. ఈ సారి బి‌ఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సారి ఎవరికి పూర్తి మెజారిటీ రాదనే చర్చ నడుస్తోంది. బి‌జే‌పి ఓ 10 సీట్లు వరకు గెలుచుకునే ఛాన్స్ ఉందని, అటు బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మ్యాజిక్ ఫిగర్‌ అందుకోలేవని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ మీడియా సంస్థ ఆంధ్రజ్యోతి..ఒక సంచలన కథనం ఇచ్చింది. మొదట నుంచి కే‌సి‌ఆర్‌కు యాంటీ భావజాలంతోనే ఉంటూ వస్తున్న ఈ సంస్థ..టి‌డి‌పికి అనుకూలమనే సంగతి తెలిసిందే..ఇటు తెలంగాణలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ముందుకెళుతుందనే ప్రచారం ఉంది.

ఈ నేపథ్యంలో ఆ సంస్థ..ఈ సారి బి‌ఆర్‌ఎస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే బి‌జే‌పి మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కథనం ఇచ్చింది.  అందుకు బదులుగా కేంద్రంలో బీజేపీకి బీఆర్‌ఎస్‌ సహకారం అందిస్తుందని, అందుకే రెండు పార్టీలు పరస్పరం సున్నితమైన విమర్శలకే పరిమితమవుతున్నాయని..గులాబీ తోటలో కమలం అంటూ కథనం ఇచ్చింది.

దీనిపై బి‌ఆర్‌ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. కావాలని బి‌ఆర్‌ఎస్ పార్టీని దెబ్బకొట్టడానికి ఇలా చేస్తుందని, తాజాగా అభ్యర్ధుల లిస్ట్ ప్రకటించే సమయంలో కే‌సి‌ఆర్..కుల, గుల పత్రికలు ఉన్నాయని అవమానించడంతో ఆ మీడియా సంస్థ…రివెంజ్ తో ఈ కథనం ఇచ్చిందనే టాక్ కూడా ఉంది. అయితే ఇప్పటికే బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి నిప్పు మాదిరిగా ఉన్నాయి..అలాంటప్పుడు ఆ మీడియా సంస్థ ఇచ్చిన కథనం నిజమవ్వడం జరిగే పని కాదని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version