హైకోర్టు తీర్పు ఇవ్వడమే ఆలస్యం.. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సమరానికి తెరదీసేందుకు సన్న ద్దమైంది. మరి ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షందూకుడు ఎలా ఉంటుంది? ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుం ది? ఇప్పటి వరకు ప్రబుత్వంపై చేసిన ఉద్యమాలు ఏమేరకు ఫలిస్తున్నాయి. చంద్రబాబు గ్రాఫ్ .. సార్వ త్రిక సమరం తర్వాత ఏమైనా పుంజుకుందా? గ్రామీణ స్థాయిలో పొగొట్టుకున్న ఓటు బ్యాంకు ఇప్పుడు స్థానికంలో అయినా బాబుకు దఖలు పడుతుందా? జెండా పక్కన పెట్టి జరిగే.. ఈ ఎన్నికల్లో బాబాకు ప్రజలు మద్దతిస్తారా? అనే సందేహాలు టీడీపీలో తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి.
వాస్తవానికి గడిచిన ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోగొట్టుకున్న విశ్వసనీయతనుచంద్రబాబు గడి చిన పదిమాసాల్లో కూడగట్టుకుని ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఈ విషయంలో టీడీపీ విఫలమైందనే వాదన వినిపిస్తోంది. జగన్ ప్రభుత్వ ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో చంద్రబాబు వెనుకబడ్డారని అంటున్నారు. మూడు రాజధానులతో ఆయన కేవలం గుంటూరు, కృష్ణా, ప్రకాశం తదితర జిల్లాల్లోనే పోరాటం సాగించాల్సిన పరిస్తితి ఏర్పడింది.
అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం విషయంలోనూ చంద్రబాబు ఎత్తుకున్న వ్యూహం చతికిల పడింది. ప్రభుత్వం చేసిన ఎదురుదాడితో నాయకులు సహా బాబు అనుకూల మీడియా కూడా చతికిల పడింది. ఇక, పింఛన్ల పెంపు, వాహన మిత్ర, రైతు భరోసా, గ్రామ సచివాలయాల ఏర్పాటు వంటి కీలకమైన పథ కాలు.. కేవలం పది మాసాల్లోనే జగన్ ప్రభుత్వాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లాయి. ఈ ప్రభావాన్ని తట్టు కునేలా చంద్రబాబు వ్యూహం సిద్ధం చేయలేకపోయారు.
దీనికితోడు.. ఎన్నికల్లో ఓడిన నాయకులు ఇప్పటి వరకు 75 శాతం మంది ఇంటి గడప కూడా దాటలేదు. దీంతో స్థానిక సమరంలో పార్టీని గట్టెక్కించే నాయ కులు కనిపించడం లేదు. మరోపక్క, చంద్రబాబు మెప్పుకోసం కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నారు. మరి ఇన్ని వ్యతిరేకతల నడుమ పార్టీని ముందుకు తీసుకువెళ్లడం చంద్రబాబుకు అనుకున్నంత ఈజీకాదని అంటున్నారు పరిశీలకులు.