విభజన సమస్యల పరిష్కారం అంత ఈజీనా?

-

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. విభజన హామీల పరిష్కారం కోసం ఏపీ, తెలంగాణ సీఎంలు ఈనెల 6న సమావేశం కానున్న నేప‌థ్యంలో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇది సర్వసాధారణమే అయినా.. రాజకీయంగా సమస్యల పరిష్కారం మాత్రం అంత ఈజీ కాదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణ సమాజంలో గూడు కట్టుకున్న సెంటిమెంటును కాదని.. .తెలంగాణ‌ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేసి అవకాశం లేదు. ఏ చిన్న పొరపాటు జరిగినా తెలంగాణ సమాజంలో ఆయన ఏకాకి కావ‌డం ఖాయం. ఓ విధంగా చెప్పాలంటే ఆయనకు ఇది సంకట స్థితి.

ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో సెంటిమెంట్ అధికం. గతంలో జగన్ తో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు సార్లు సమావేశం అయ్యారు. కానీ ఎలాంటి ఫలితం ఇవ్వలేకపోయారు. చాలా సమస్యలకు పరిష్కార మార్గం చూపలేకపోయారు. ఇప్పుడు అదే సమస్య రేవంతును కూడా వెంటాడుతోంది. తెలంగాణ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తప్పకుండా ఆయన నడుచుకోవాల్సి ఉంటుంది. తాగు, సాగునీటి విషయంలో వివాదాలను ఏకపక్షంగా పరిష్కరించే వీలు కనిపించడం లేదు.

విభజన చట్టంలోని ఆస్తులను ఏపీకి ఇవ్వకుండా కెసిఆర్ రాజకీయం చేశారు. కేవలం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాను నడుచుకున్నానని సెంటిమెంట్ను రగిలించారు. విభజన సమస్యల పరిష్కారానికి జాప్యం చేయడం వెనక కేసీఆర్ రాజకీయం ఉంద‌ని నిపుణులు అంటున్నారు..చాలా అంశాలు రాష్ట్రాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయి. అందుకేవాటిని దాటుకొని రేవంత్ ముందుకెళితే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. రేవంత్ పై రివెంజ్ కు విపక్షాలు కాచుకొని కూర్చున్నాయి. ఏపీకి ఎటువంటి ప్రయోజనం దక్కినా.. తెలంగాణ పరంగా వెనక్కి తగ్గిన రేవంత్ పై విమర్శలు చుట్టుముడతాయి.

2014లో నవ్యాంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సీఎం అయ్యారు. కొద్దిరోజులపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ తో సఖ్యతతో ముందుకెళ్లారు. కానీ తర్వాత రాజకీయపరమైన విభేదాలతో అంతరం పెరిగింది.సెంటిమెంట్ మాటున తెలంగాణలో కెసిఆర్ దూకుడుగా వ్యవహరించారు. దీంతో చంద్రబాబులో ఒక రకమైన భయం కనిపించింది. న్యాయ పరమైన పోరాటానికి పరిమితం అయ్యారు. కొన్ని ఆస్తులను సైతం వదులుకోవాల్సి వచ్చింది. జగన్ అయితే ఉమ్మడి ఆస్తులు గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో చంద్రబాబు సర్కార్ చేసిన న్యాయ పోరాటాన్ని సైతం తప్పించారు. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం అంటే తేనేటి విందు అన్న విమర్శ ఉంది. ఇప్పుడు తాజాగా సీఎంల సమావేశం .ఆ విమర్శకు బ్రేక్ వేస్తుందో? లేదో? చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version