ఆ దేశాల నుంచి విరాళాలు రావడం ఆశ్చర్యకరం..?

-

ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం అందరికీ తెలిసిందే. కరోనాపై పోరు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘పీఎం కేర్స్ ఫండ్’ను ఏర్పాటు చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ పలు ప్రశ్నలను సంధించింది. విరాళాలు వస్తున్న తీరుపై అనేక అనుమానాలు లేవనెత్తింది. శత్రు దేశంగా పరిగణిస్తూ.. ఆ దేశాల నుంచి విరాళాలు ఎలా సేకరిస్తారని ప్రశ్నించింది.

ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా.. ప్రధాని నరేంద్రమోదీకి కొన్ని ప్రశ్నలు వేశాలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా సమయంలో పీఎం కేర్స్ ఫండ్ కు పాకిస్థాన్, చైనా, ఖతార్ వంటి దేశాలను విరాళాలు వచ్చాయి. శత్రు దేశాల నుంచి విరాళాలు రావడం ఆశ్చర్యకరమైన అంశమన్నారు. అందుకే ప్రధాన మోదీకి కొన్ని ప్రశ్నలు అడుతున్నానని వెల్లడించారు.

మోదీకి రణ్ దీప్ సూర్జేవాలా అడిగిన ప్రశ్నలు..
1. పీఎం కేర్స్ నిధుల కోసం విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ఎందుకు ప్రచారం చేసి విరాళాలు స్వీకరించాయి..?
2. చైనాకు చెందిన నిషేధిత యాప్ లలో నిధుల సేకరణకు సంబంధించిన ప్రకటనలు ఎందుకు ఇచ్చారు..?
3. పాకిస్థాన్ నుంచి ఎంత నిధులు వచ్చాయి. అవి ఎవరిచ్చారు..?
4. ఖతార్ లోని రెండు పెద్ద కంపెనీల నుంచి భారీగా విరాళాలు వచ్చాయి. అవి ఇప్పటివరకు ఎన్ని నిధులు అందించాయి..?
5. ఇప్పటివరకు 27 దేశాల నుంచి ఎంతెంత నిధులు వచ్చాయి..?
అని సూర్జేవాలా కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఎన్ఐఎస్ఎస్ఈఐ ఏఎస్బీ కంపెనీ విరాళాలు సేకరించి కర్మాగారాన్ని ప్రారంభించుకునేలా క్విడ్ ప్రోకో జరిగిందా అని రణ్ దీప్ సూర్జేవాలా నిలదీశారు. నిధులు తీసుకున్న 27 దేశాల్లో భారత రాయబార కార్యాలయాలు పీఎం కేర్స్ గురించి ఎందుకు రహస్యంగా ప్రచారం చేశాయని ప్రశ్నించారు. ఎఫ్.సీ.ఆర్.ఏ చట్ట పరిధి నుంచి పీఎం కేర్స్ నిధులకు మినహాయింపు ఎందుకిచ్చారని అడిగారు. ఇన్ని వెసులు బాటులు పీఎం కేర్స్ కే ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని.. వీటికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version