తెలంగాణలో బీఎస్పీ ఎదిగేనా..? ప్రవీణ్ కుమార్ ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి?

-

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల మాజీ కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఇటీవల వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన సంగతి అందరికీ విదితమే. ఆయన ఇవాళ బీఎస్పీ పార్టీలో అఫీషియల్‌గా జాయిన్ అయ్యారు. ‘అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం’ అనే నినాదంతో బహుజనులకు మేలు చేసేందుకు పార్టీలో చేరినట్లు ఆయన ప్రకటించారు. అయితే, తెలంగాణాలో బీఎస్పీకి ఉన్న కేడర్, నేతలు అంతంత మాత్రమే కాగా, ఈ పార్టీని రాజకీయ అధికారంలోకి తీసుకోవడంలో ప్రవీణ్ ఏ మేరకు సఫలమవుతారు? అనే విషయమై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

బీఎస్పీ జాతీయ నేత రాంజీ గౌతం ఆధ్వర్యంలో నల్లగొండలోని ఎన్జీ కాలేజ్‌లో ‘రాజ్యాధికార సంకల్ప సభ’ పేరిట జరిగిన సభలో డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరారు. అయితే, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే బలంగా ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా ప్రవీణ్ ఎలాంటి ప్రణాళికలు రచించబోతున్నారు? పాలసీస్ ఎలా ఉండబోతున్నాయి? అనేవి ప్రవీణ్ ప్రకటనల ద్వారా తెలియొచ్చు. ఇకపోతే ప్రవీణ్‌కు ఇప్పటికే ఉన్న నెట్‌వర్క్ స్వేరోస్ ప్లస్ బహుజన ఎంప్లాయిస్ మీటింగ్స్‌లో కలిసిన వారు, మేధావులు బీఎస్పీకి సపోర్ట్ చేస్తారా? అనేది ఫ్యూచర్ టైంలో తెలుస్తుంది.

అయితే, బీఎస్పీ ద్వారా ఓన్లీ దళితులు మాత్రమే అట్రాక్ట్ అవుతారనే అపోహ ఉండగా, ఎస్టీ, బీసీ, మైనారిటీలను బీఎస్పీలోకి చేర్చుకునేందుకుగాను ప్రవీణ్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? అనేదీ తెలియాల్సి ఉంది. మొత్తానికి తెలంగాణ రాజకీయ తెరపైన మరో పొలిటికల్ పార్టీ అయితే ఉండబోతున్నది. ఇటీవల కాలంలో దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ షర్మిల వైఎస్ఆర్‌టీపీ పార్టీ స్థాపించి తెలంగాణలో బరిలో ఉంది. ఇప్పుడు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తరఫున బరిలో రాజకీయ క్షేత్రంలో ఉండబోతున్నారు. అయితే, ఈ పార్టీ నుంచి జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో నేతలు, కార్యకర్తలకు సంబంధించిన ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version