తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. బిఆర్ఎస్ తన అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ములుగు అసెంబ్లీ నియోజకవర్గం గురించి రాజకీయంగా రసవత్తరమైన చర్చ నడుస్తుంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీతక్క ఎప్పుడు నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యే సీతక్కకు చెక్ పెట్టాలని టిఆర్ఎస్ వ్యూహరచన చేసి ఆ దిశగా పావులు కలుపుతోంది. ఆ ఆలోచనల ఫలితమే సీతక్క పై పోటీకి బడే నాగజ్యోతి పేరును కేసీఆర్ ప్రకటించారు.
సీతక్క పై నాగజ్యోతి గెలవగలదా లేదా అని రాజకీయంగా చర్చ మొదలైంది. సీతక్క పీపుల్స్ వారి పార్టీలో పనిచేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చింది. నాగజ్యోతి తల్లిదండ్రులు నక్సల్స్ ఉద్యమ పార్టీలు పనిచేసే ప్రాణాలు కోల్పోయిన త్యాగశీలులు. ఇద్దరూ ఉద్యమ పార్టీలకు చెందిన వారే అయినా సీతక్క ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్నది. నాగజ్యోతి ఉద్యమకారుల వారసురాలు మాత్రమే. నాగజ్యోతి జడ్పీ వైస్ చైర్మన్ గా ఉంటూ ప్రజలకు అందుబాటులోనే ఉన్న సీతక్క అంతలా ప్రజలతో మమేకం కాలేరు.
సీతక్క 2009లో టిడిపి నుండి విజయం సాధించింది.. 2014లో ఓడిపోయిన 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఘన విజయం సాధించింది. టిడిపి నుండి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి ప్రియ శిష్యురాలిగా తెలంగాణ కాంగ్రెస్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీతక్క పై ఎవరు పోటీ చేసిన గెలుపు కష్టమే అని రాజకీయ నిపుణులు అంటున్నారు.
కరోనా సమయంలో గిరిజనులకు బాసటగా నిలుస్తూ నియోజకవర్గ ప్రజలకు సీతక్క చేరువయ్యారు. భారీగా కురిసిన వర్షాలతో నీడ కోల్పోయిన నియోజకవర్గ ప్రజలకు సీతక్క అండగా ఉండి తిండి, నీరు ,నివాస సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వం నుండి రావలసిన సహాయాన్ని అందించడంలో తన వంతు కృషి చేశారు. ఇలా ఎప్పుడు ప్రజలకు చేరువుగా ఉండే సీతక్కను ములుగు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు, ఎంతలా అంటే అక్కడ నిలబడే అభ్యర్థి సీతక్క అయితే చాలు పార్టీతో సంబంధం లేదు. వారి ఓటు సీతక్కకే, అలాంటి సీతక్క పై బిఆర్‌ఎస్ అభ్యర్థిని నిలబెట్టి గెలుపు పొందాలనుకోవడం కష్టమే అని అందరి అభిప్రాయం.