ఆనం-కోటంరెడ్డి ఎఫెక్ట్: నెల్లూరులో తొలిసారి టీడీపీకి లీడ్?

-

ఉమ్మడి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం కలిసిరాని నియోజకవర్గం. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పెద్దగా సత్తా చాటలేదు. గత నాలుగు ఎన్నికల్లో జిల్లాలో టీడీపీకి ఆధిక్యం రాలేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీకి లీడ్ లేదు. 2004, 2009లో జిల్లాలో కాంగ్రెస్ హవా నడవగా, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది.

ఇక 2014లో జిల్లాలో 10 సీట్లు ఉంటే టీడీపీకి 3 సీట్లు దక్కాయి. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. అంటే నెల్లూరులో టీడీపీ బలం ఏ మాత్రం ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే పూర్తిగా వైసీపీ హవా నడుస్తున్న ఈ జిల్లాలో ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాలు టి‌డి‌పికి ప్లస్ అవుతున్నాయి. మామూలుగానే అధికార వైసీపీపై కాస్త వ్యతిరేకత పెరుగుతుంది..అటు కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. అదే సమయంలో సీనియర్ ఎమ్మెల్యేలు అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డిలు తిరుగుబాటు చేయడం, వారు వైసీపీ నుంచి బయటకు రావడంతో సీన్ రివర్స్ అయింది.

 

అలాగే వారు టీడీపీలోకి వస్తే..టీడీపీ బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కోవర్టు రాజకీయం చేస్తారా? అనే భయం టి‌డి‌పిలో ఉంది. కానీ నెల్లూరులో టీడీపీకి ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఇప్పటికే నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి లాంటి స్థానాల్లో టి‌డి‌పికి లీడ్ కనిపిస్తుంది. ఇక ఆనం-కోటంరెడ్డిల దెబ్బతో నెల్లూరు రూరల్, వెంకటగిరి స్థానాల్లో టీడీపీకి ప్లస్ కావచ్చు.

అటు ఆత్మకూరు, కోవూరు స్థానాల్లో టీడీపీ పుంజుకోవచ్చు. అలాగే గూడూరులో వైసీపీ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అక్కడ టీడీపీ బలపడితే..ప్లస్ అవుతుంది. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరులో టీడీపీకి ఆధిక్యం దక్కే అవకాశం ఉంది. కానీ వైసీపీలో ఉన్న లొసుగులని టీడీపీ సరిగ్గా వాడుకుంటేనే లీడ్ వస్తుంది..లేదంటే అంతే.

Read more RELATED
Recommended to you

Exit mobile version