ఆంధ్రప్రదేశ్ లో ఐటి దాడుల విషయంలో జరిగిన ప్రచారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఈ విషయంలో చాలా ఆశలే పెట్టుకున్నారు. చంద్రబాబుని కచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగానే జరిగింది. ఇది ఎంత వరకు నిజమో తెలియకుండా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా దీనిపై అనవసర ప్రచారం కూడా చేసారు.
అసలు ఆ స్థాయిలో ఆస్తులు దొరికితే ఐటి శాఖ ఏ విధంగా ప్రకటన చేయకుండా ఉంటుంది. అది కూడా ఒక వ్యక్తి దగర దొరికి ఉంటే జాతీయ మీడియా ఎందుకు కవర్ చేయడం లేదని కూడా ఆలోచన లేకుండా కొంత మంది వ్యాఖ్యలు చేసారు. తాజాగా దీనిపై ఐటి శాఖ పంచనామా విడుదల చేసింది. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ దాడుల్లో పట్టుబడిన సొమ్ము వివరాలు తమ నివేదికలో వెల్లడించింది.
రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఐటి శాఖ పేర్కొంది. రూ.2 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఐటీ పంచనామా నివేదికలో స్పష్టం చేసింది. సదరు పంచనామా నివేదికపై శ్రీనివాస్, ఐటీ అధికారుల సంతకాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారని రెండ్రోజుల నుంచి ycp ఆరోపణలు అవాస్తవమని తేలింది.