పవన్ కళ్యాణ్ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పగ పట్టిందని నాగ బాబు అన్నారు. వకీల్ సాబ్ సినిమా నుంచి భీమ్లా నాయక్ సినిమా వరకూ.. పవన్ ను రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేయడం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. అన్ని సిద్ధం చేసిన తర్వాత కూడా సినిమా టికెట్ల ధరల జీవో ను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతోనే జీవోను విడుదల చేయడం లేదని మండి పడ్డారు.
అధికారం ఐదు సంవత్సరాలే ఉంటారని వైసీపీ గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే.. సినీ పరిశ్రమ పెద్దలు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు సినీ పరిశ్రమ పెద్దలు మద్దతు ఇవ్వకపోవడం దురదృష్టకరం అని అన్నారు. ఇలాంటి సమస్య ఎవరికీ వచ్చినా.. తాము ముందు ఉంటామని నాగ బాబు అన్నారు. వారికి తప్పక సహకారం అందిస్తామని అన్నారు. హీరో, నిర్మాత, దర్శకుడు అని తేడా లేకుండా తమ సహకారం ఉంటుందని అన్నారు.