రాజకీయాల్లో ఏ నాయకుడుకైన అంతిమ లక్ష్యం అధికారం దక్కించుకోవడం..అధికారం దక్కించుకుంటేనే సక్సెస్ అయినట్లు…అందుకే ఏ నాయకుడైన అధికారం కోసమే కష్టపడతారు..ఇప్పుడు ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ సైతం అధికారం కోసం కష్టపడుతున్నారు. ఇప్పుడు ఎలాగో జగన్ అధికారంలో ఉన్నారు..సీఎంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అయితే రెండోసారి కూడా అధికారం దక్కించుకోవాలని చెప్పి జగన్ కష్టపడుతున్నారు.
అటు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు సైతం…ఈ సారి చావో రేవో అన్నట్లు కష్టపడుతున్నారు..ఈ సారి అధికారం దక్కించుకోకపోతే..మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమనే విషయం బాబుకు అర్ధమైపోతుంది..ఎందుకంటే బాబుకు వయసు మీద పడుతుంది. అంటే మొత్తం మీద ఇద్దరు నాయకులు అధికారం కోసం బాగా కష్టపడుతున్నారు. ఇక వారు కష్టపడటమే కాదు…తమ పార్టీ నేతలని కూడా బాగానే కష్టపెడుతున్నారు…కష్టపడకపోతే గట్టిగా వార్నింగ్ లు కూడా ఇచ్చేస్తున్నారు. అసలు కష్టపడకపోతే సీట్లు ఇవ్వమని హెచ్చరిస్తున్నారు.
ఇటీవల కాలంలో ఇద్దరు నేతలు వరుసపెట్టి…తమ తమ పార్టీ నేతలని ఓ రేంజ్ లో వాయిస్తున్నారు..ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టి క్లాస్ తీసుకుంటున్నారు. తాజాగా కూడా ఓ వైపు జగన్…మరో వైపు బాబు తమ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తాజాగా వైసీపీ వర్క్ షాప్ లో ఎమ్మెల్యేలకు జగన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు…ప్రతి ఒక్కరూ గడప గడపకు వెళ్లాలని, వెళ్లని వారికి ఈ సారి సీటు కూడా ఇవ్వనని చెప్పేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా 175కి 175 సీట్లు గెలిచేయాలని జగన్ అంటున్నారు.
అటు బాబు సైతం…తమ పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు..ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ…పని చేయని నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇకనుంచైనా పనితీరు మెరుగుపరుచుకోవాల్సిందే అని, మూడేళ్లయినా కదలకుంటే కుదరదని, ఇక అప్పటికి మారని వారిపై కఠిన చర్యలు తప్పవని, వారికి సీట్లు ఉండవని తేల్చి చెప్పేస్తున్నారు…మొత్తానికి అధికారం కోసం అటు జగన్..ఇటు బాబు..సొంత పార్టీ నేతలని గట్టిగా వాయించేస్తున్నారు.