2017 జనవరి 26… బహుశా వైసీపీ కార్యకర్తలు గాని టీడీపీ కార్యకర్తలు గాని మర్చిపోలేని రోజు అది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్… ఇచ్చిన పిలుపు కోసం ప్రత్యేక హోదా ఉద్యమానికి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ విశాఖ వెళ్ళారు. హైదరాబాద్ నుంచి విశాఖలో అడుగుపెట్టారు ఆయన. ఆ తర్వాత ఆయన విశాఖ విమానాశ్రయ౦లో అడుగుపెట్టగానే పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. రన్ వే మీద నిరసన చేసారు వైఎస్ జగన్.
అప్పుడు పోలీసులు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అడ్డుపడ్డారు. దీనిపై అప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు మాట్లాడట్లేదు మాట్లాడే వాళ్ళను అడ్డుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు పలువురు. ఇప్పుడు సరిగా చంద్రబాబుకి అదే అనుభవం ఎదురైంది. అదే విధంగా అడ్డుకున్నారు చంద్రబాబుని పోలీసులు. వైసీపీ కార్యకర్తలు విమానాశ్రయం వద్దకు వచ్చి నిరసన తెలియజేసారు.
పోలీసులు చంద్రబాబుని కాన్వాయ్ దిగవద్దు అంటూ అడ్డుకున్నారు. అప్పుడు ఎలా అయితే పోలీసులతో జగన్ ని చంద్రబాబు అడ్డుకున్నారో అదే పోలీసులతో జగన్ చంద్రబాబుని అడ్డుకున్నారు. దీనితో ఒక్కసారిగా చంద్రబాబు షాక్ అయ్యారు. ఆయన్ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని బయటకు రానీయడం లేదు. విశాఖ ద్రోహి చంద్రబాబు అంటూ విమర్శలు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు.
ఇప్పుడు పోలీసుల తీరుని టీడీపీ కార్యకర్తలు తప్పుబడుతున్నారు. ఆ రోజు చంద్రబాబు ఎం చేసారో జగన్ కూడా ఇప్పుడు అదే చేసారు. మరి ఎందుకు టీడీపీ కార్యకర్తలు అంత ఇబ్బంది పడుతున్నారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. కాగా విశాఖ విమానాశ్రయంలో దాదాపు మూడు గంటలు గా చంద్రబాబుని అడ్డుకున్నారు పోలీసులు. వైసీపీ కార్యకర్తల ఆందోళన తో పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా చంద్రబాబుని ఆపేశారు.