జగన్ రివర్స్ స్ట్రాటజీ..ఎమ్మెల్యేలుగా ఎంపీలు..!

-

నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ గట్టిగానే ట్రై చేస్తున్నారు…ఈ సారి కూడా అధికారాన్ని వదులుకోకూడదని జగన్ ఉన్నారు…ఈ సారి గాని అధికారం కోల్పోతే కసితో ఉన్న టీడీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు. అందుకే మళ్ళీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. ఈ సారి గెలవడం కోసం సరికొత్త స్ట్రాటజీలతో ముందుకొస్తున్నారు.

పార్టీ గెలుపు కోసం కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకుండా పక్కన పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు…అలాగే కొందరు ఎమ్మెల్యేల సీట్లు మార్చాలని చూస్తున్నారు. అదే సమయంలో కొందరు ఎంపీలు కూడా డేంజర్ జోన్ లో ఉన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేలని…ఎంపీలుగా, ఎంపీలని…ఎమ్మెల్యేలుగా నిలబెట్టాలని జగన్ రివర్స్ స్ట్రాటజీ ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు ఎంపీలని…అసెంబ్లీ స్థానాల్లో నిలబెట్టడానికి జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇదే క్రమంలో రాజమండ్రి ఎంపీ భరత్…రాజమండ్రి సిటీ లేదా రూరల్‌లో పోటీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అటు విశాఖ ఎంపీ ఎం‌వి‌వి సత్యనారాయణని…విశాఖ తూర్పులో పోటీకి దింపవచ్చు అని, విజయనగరం ఎంపీ చంద్రశేఖర్‌ని ఎచ్చెర్ల సీటులో పోటీకి దింపుతారని సమాచారం. అలాగే బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ని…తాడికొండ లేదా ప్రత్తిపాడులో పోటీకి దింపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ రెండు సీట్లు కుదరకపోతే…ఆయనకు నెక్స్ట్ సీటు డౌటే అని తెలుస్తోంది.

అనకాపల్లి ఎంపీ సత్యవతిని..అనకాపల్లి అసెంబ్లీలో పోటీకి దింపి..అనకాపల్లిలో ప్రస్తుతం సిట్టింగ్‌గా ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్‌ని గాజువాక సీటుకు పంపించవచ్చు అని సమాచారం. అటు రాయలసీమలో కూడా కొన్ని మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది…అక్కడ ఇద్దరు ఎంపీలని అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దింపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి జగన్ పూర్తిగా రివర్స్ స్ట్రాటజీలో వెళ్లనున్నారని అర్ధమవుతుంది. మరి ఈ స్ట్రాటజీని ఫాలో అవుతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version