నాకు పోరాటం నేర్పింది నా గుండెచప్పుడైన తెలంగాణ : పవన్ కల్యాణ్

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్నారు. ఈ సమావేశంలో ఆయన వైసీపీ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు. తనను ప్యాకేజీ స్టార్ అని ఇక నుంచి ఎవరైనా పిలిస్తే చప్పుతో కొడతానని.. సమావేశంలోనే చెప్పు తీసుకుని చూపించి మరి వార్నింగ్ ఇచ్చారు. కులాల పేరుతో వైసీపీ నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

ఈ సమావేశంలో పవన్ కల్యాణ్.. తెలంగాణపై తనకున్న ప్రేమని చాటుకున్నారు. తనకు పోరాట పటిమను నేర్పిందే తన గుండెచప్పుడైన తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ ప్రజల్లో ఉన్న ఐక్యత ఆంధ్రాలో లేదని అన్నారు. తెలంగాణలో ఏదైనా అన్యాయం జరిగితే అందరూ కలిసి గొంతెత్తుతారని.. కానీ ఏపీలో అలా ఉండదని తెలిపారు. శ్రీకాంతాచారి లాంటి ఎందరో తెలంగాణ సాధించడానికి తమ ప్రాణాలు కూడా లెక్కచేయలేదని.. కానీ అలాంటి ఐక్యత కరవని పవన్ కల్యాణ్ అన్నారు.

‘అన్ని కులాలు బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను.. కులాలు రెచ్చగొట్టాలని చూస్తే నరికి చంపేస్తా.. నేను వాహనం కొంటే ఎవరో ఇచ్చారని విమర్శిస్తారా.. అరెయ్ ఎదవల్లరా మీకు నా సంపాదన ఎంతో తెలుసా? వంద నుంచి 120 కోట్లు సంపాదించా.. నా పిల్లల పేరు మీద డిపాజిట్ చేసిన డబ్బుతో పార్టీ కార్యాలయం కట్టా.. రూ.33.37 కోట్లు ఇన్ కం ట్యాక్స్ కట్టాను.. అయోధ్య రామాలయానికి ఫండ్ ఇచ్చాను.. జీఎస్టీ అదనంగా చెల్లించా’ అంటూ ప్యాకేజీ స్టార్ అని తనను విమర్శిస్తున్న వైసీపీ నేతలకు పవన్ కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version