ప్యాకేజీ తీసుకున్నానని ఎవడైనా అంటే చెప్పుతో కొడతా – పవన్ కళ్యాణ్

-

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి నేతలే లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఇంకోసారి తాను ప్యాకేజీ తీసుకున్నానని ఎవడైనా అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాలగొడతానని చెప్పు తీసి మరీ చూపించారు. ” ఇళ్ల నుంచి లాక్కొచ్చి మరీ కొడతా నాా కొడకల్లారా. ఇప్పటివరకు మిమ్మల్ని కాపాడింది నా సహనమేరా.

నన్ను గొడవల్లోకి లాగితే నాలుక చీరేస్తా. తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతా. నాపై బూతుల పంచాంగం విప్పే ప్రతి వాడిని నించోబెట్టి తోలు తీస్తా. ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగే మీరా చెప్పేది. నాకు రాజకీయం తెలియదనుకుంటున్నార్రా. రెండ్రా.. ఎంతమంది వైసిపి గుండా ఎమ్మెల్యే కొడుకులొస్తారో రండి. నేను వాహనం కొంటే ఎవరో గిఫ్ట్ ఇచ్చారని అంటారా. దానికి జీఎస్టీ కూడా కట్టా. ఎదవల్లారా నా సంపాదన ఎంతో మీకు తెలుసా?.

విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నారా నేను. కొడకల్లారా గుర్తు పెట్టుకోండి. యుద్ధం ఎప్పుడో చెప్పండి రా.. రాడ్ల.. హాకీ స్టిక్కులా.. ఉట్టి చేతులా? ఛాలెంజ్ విసురుతున్న నా కొడకల్లారా. తోలు తీస్తా నా కొడకల్లారా ఒక్కొక్కడికి. ఈరోజు నుంచి యుద్ధమే”. అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version