ప్ర‌చారంలో ‘ కందాళ ‘ దూకుడు.. ‘ పొంగులేటి ‘ దిక్కుచూపులు…!

-

ఎన్నిక‌లు అన‌గానే స‌హ‌జంగానే నాయ‌కులు తమ త‌మ ప్ర‌చారాల‌ను ముమ్మ‌రం చేస్తారు. ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఈ క్ర‌మంలో తాము పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గానికి తాము ఏం చేస్తున్నామో.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏం చేశామో.. భ‌విష్య‌త్తులో ఏం చేస్తామో కూడా చెప్పుకొంటారు. దీనిని బ‌ట్టే ప్ర‌జ‌లు నాయ‌కుల‌ను ఆద‌రిస్తారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం.. బీఆర్ ఎస్ అభ్య‌ర్థి కందాళ ఉపేంద‌ర్ రెడ్డి ఈ దిశ‌గా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

2018 నుంచి ఎమ్మెల్యేగా ఉన్న తాను నియోజ‌క‌వ‌ర్గానికి ఏం చేసిందీ చెప్పుకొంటున్నారు. భ‌విష్య‌త్తులో ఏం చేయాల‌ని అనుకుంటున్న‌దికూడా వివ‌రిస్తున్నారు. పైగా.. కందాళ స్థానికుడు కావ‌డంతో ఆయ‌న‌పై ప్ర‌జ‌ల్లోనూ న‌మ్మ‌కం క‌లుగుతోంద‌ని ప‌లు స‌ర్వేలు చెబుతున్నాయి. ఇక‌, ఇదేస‌మ‌యంలో కాంగ్రెస్ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన‌.. పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి స్థానికుడు కాక‌పోవ‌డం.. అసెంబ్లీకి తొలిసారి పోటీస్తుండ‌డంతో ఆయ‌న ఊహించిన దానికంటే బాగా వెనుక‌బ‌డ్డార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

పైగా పాలేరుకు ఆయ‌న ఖమ్మం ఎంపీగా ఉన్న స‌మ‌యంలోనూ ఏమీ చేయ‌లేద‌ని.. ఇప్పుడు ఏం చేసిందీ చెప్పుకొనే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. భ‌విష్య‌త్తులోఆయ‌న ఏం చేయాల‌న్నా.. కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సి ఉంటుంద‌ని.. ఇది సాధ్య‌మేనా? అనే ప్ర‌శ్న‌లు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య ఎక్కువుగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. అస‌లు టిక్కెట్ల కేటాయింపులో ఆల‌స్యం, పైగా పాలేరులో కాంగ్రెస్ నుంచి తుమ్మ‌లా, పొంగులేటా పోటీ చేసేది అన్న‌ది చివ‌రి వ‌ర‌కు తేల‌లేదు. దీంతో పొంగులేటు ప్ర‌చారంలో వెనుక బ‌డ్డార‌నే వాద‌న వినిపిస్తోంది. పైగా కందాళ‌కు అనుకూలంగా కేసీఆర్ ప్ర‌చారం చేశారు. పొంగులేటికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయ‌కులు ఎవ్వ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. దీంతో ఆయ‌న ప్ర‌చారం అంతా నామ్‌కే వాస్తేగా సాగుతోంది.

కందాళ ప్ల‌స్‌లు ఇవే…

  • పాలేరు నియోజకవర్గంలోని 35 శాతం మంది యువత కందాళ‌పైనే ఆశ‌లు పెట్టుకున్నారు. ఆయ‌న ద్వారానే త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు. పోటీ ప‌రీక్ష‌ల‌కు ఉచిత కోచింగ్, స్ట‌డీమెటీరియ‌ల్‌, జేఎన్‌టీయూ కాలేజ్‌, న‌ర్సింగ్ కాలేజ్‌ల‌తో పాటు ఫిష‌రీస్ కాలేజ్ ర‌ప్పించ‌డం ఇవ‌న్నీ యువ‌త ప‌ట్ల ఆయ‌న‌లో న‌మ్మకం క‌లిగిస్తున్నాయి.
  • పాలేరు నియోజకవర్గాన్ని మోడల్ గా మారుస్తామని కందాళ ఇస్తున్న హామీపై ప్ర‌జ‌లు న‌మ్మ‌కంతో ఉన్నారు. కేసీఆర్ నోటితో నియోజ‌క‌వ‌ర్గంలో 100 % శాతం ద‌ళిత బంధు అమ‌లు చేస్తామ‌ని చెప్పించ‌డం కూడా ఆయ‌న‌పై ప్ర‌జ‌ల్లో మ‌రింత న‌మ్మ‌కం కుదిరింది.
  • ఇప్ప‌టికే జ‌రిగిన అభివృద్ధి, ఆసుపత్రులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్న‌ హామీని ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తున్నారు.
  • ఎమ్మెల్యే కందాళ‌పై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం… ఈ విష‌యంలో ఆయ‌న క్లీన్ యూ స‌ర్టిఫికెట్‌తో ఉన్నారు.
  • ఉపేందర్ రెడ్డి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూనే, తన ఫౌండేషన్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తున్నాయి.
  • లోక‌ల్ – నాన్‌లోక‌ల్ ప్ర‌చారంలో కందాళ దూకుడు.
  • నియోజకవర్గంలో మరణించిన ప్రతి కుటుంబానికి 10,000, గాయపడిన ప్రతి కుటుంబానికి 5000 ఇచ్చిన ఘ‌ట‌న‌లు పార్టీల‌కు, కులాల‌కు, మ‌తాల‌కు అతీతంగా కందాళ‌కు ప్ల‌స్‌గా మారాయి.
  • కోవిడ్ సమయంలో నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి నిత్యవసరాలు, మందులు పంపిణీ చేసి ఆదుకున్న ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌జ‌లు గుర్తు చేసుకుంటున్నారు.

పొంగులేటి మైన‌స్‌లు ఇవీ..

  • స్థానికుడు కాక‌పోవ‌డం
  • ఎన్నిక‌ల స‌మ‌యంలో ఐటీ దాడుల‌తో ఆయ‌న‌పై అవినీతి మ‌ర‌క‌లు అంటుకోవ‌డం
  • ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియ‌ద‌నే విమ‌ర్శ‌లు రావ‌డం
  • ఒంటెత్తు పోక‌డ‌ల‌తో స్థానిక కేడ‌ర్ కూడా ఆయ‌న‌ను లెక్క చేయ‌క‌పోవ‌డం.

Read more RELATED
Recommended to you

Exit mobile version