మిత్ర‌మా నీ యాక్టింగ్ సూప‌ర్‌… పొంగులేటిపై కందాళ పంచ్‌లు చూస్తే న‌వ్వాగ‌దు..!

-

తెలంగాణ‌లో జ‌రుగుతున్న ప్ర‌స్తుత‌ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌తి విష‌యం కూడా హాట్ టాపిక్‌గానే ఉంది. ముఖ్యంగా ప్ర‌త్య‌ర్థుల‌ను ఇబ్బంది పెట్టేందుకు.. అనేక విష‌యాల‌ను తెర‌మీదికి తెస్తున్నారు. కానీ, ఆయా విష‌యాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న ప్ర‌జ‌లు ఏది నిజ‌మో..ఏది న‌ట‌నో బాగానే తెలుసుకుంటున్నా రు. పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి.. సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ అభ్య‌ర్థి కందాళ ఉపేంద‌ర్‌రెడ్డిపై అవాకులు, చ‌వాకులు పేలుతున్నారు.

కందాళ మ‌నుషుల‌కు దూరంగా ఉంటార‌ని.. ప్ర‌జ‌ల‌ను ఎవ‌రినీ ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌ర‌ని.. దూరంగా పెట్టి..త‌న దొర‌తనాన్ని చాటుకుంటార‌ని.. పొంగులేటి చెబుతున్నారు. అంతేకాదు.. తాను మాత్రం ప్ర‌తి ఒక్క‌రినీ అక్కున చేర్చుకుంటాన‌ని.. హ‌గ్స్ ఇస్తాన‌ని.. షేక్ హ్యాండ్స్ ఇస్తాన‌ని చాటుకుంటున్నారు. కందాళ మా త్రం ఇంకా అంట‌రాని త‌నాన్ని చూపిస్తున్నార‌ని తీవ్ర విమ‌ర్శ‌లే చేస్తున్నారు.అయితే.. క్షేత్ర‌స్థాయిలో వాస్త‌వం ఏంటంటే.. పొంగులేటిది న‌ట‌నేన‌ని.. అంటున్నారు పాలేరు ప్ర‌జ‌లు.

ఎందుకంటే.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో పొంగులేటి.. త‌న‌కు క‌నిపించిన ప్ర‌తి ఒక్క‌రినీ హ‌త్తేసుకుంటున్నారు. షేక్ హ్యాండ్స్ ఇచ్చేస్తున్నారు. నేను ఉన్నాన‌ని చెబుతున్నారు. విచిత్రం ఏంటంటే రోడ్డు మీద వెళుతున్న‌ప్పుడు అక్క‌డ ఎవ‌రు ఉన్నారో కూడా తెలియ‌కుండా ఓ స్మైల్ ఫేస్ పెట్టి హ‌త్తుకోవ‌డం… వెంన‌టే ఫొటోగ్రాఫ‌ర్లు ఓ స్టిల్ తీసేయ‌డం ఇదే తంతు పొంగులేటి ప్ర‌చారంలో న‌డుస్తోంది. ఇదే విష‌యాన్ని కందాళ కూడా నొక్కి మ‌రీ పొంగులేటికి కౌంట‌ర్లు ఇస్తున్నారు.

రేపు ఎన్నిక‌లు ముగియ‌గానే.పొంగులేటి తుర్రుమంటారు. హైద‌రాబాద్‌లో మ‌కాం వేసేస్తారు. లేదాఖ‌మ్మం కోట‌లో నివాసం ఉంటారు. సో.. దీంతో ఇప్పుడు ఆయ‌న ఇస్తున్న హ‌గ్గులు, షేక్ హ్యాండులు అన్నీ కూడా న‌ట‌నేన‌ని వారు చెబుతున్నారు. తాను ఆర్టిఫిషియ‌ల్ న‌ట‌న చేయ‌లేన‌ని… జీవిస్తాన‌నే అంటున్న‌రాఉ.

అయితే.. పొంగులేటి చెప్పిన‌ట్టు కందాళ దూరంగానే ఉంటున్నారు. ఎవ‌రినీ హ‌త్తుకోరు.అంద‌రికీ షేక్ హ్యాండ్స్ కూడా ఇవ్వ‌రు. కానీ, వారి స‌మ‌స్య‌ల‌ను మాత్రం ఆయ‌న హృద‌యానికి హ‌త్తుకునేలా వ్య‌వ‌హ‌రిస్తారు. వారి మ‌న‌సుల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. వారి స‌మ‌స్య‌లు విన‌డ‌మేకాదు.. త‌క్ష‌ణంస్పందిస్తారు. వాటికి ప‌రిష్కారాలు కూడా చూపిస్తున్నారు. అంతేకాదు.. ఆయ‌న పాలేరులోనే ఉంటారు. ఇక్క‌డే ఆయ‌న‌కు రాజు పాలెంలో ఓటు హ‌క్కు కూడా ఉంది. కానీ, పొంగులేటికి.. ఓటు హ‌క్కు నియోజ‌క‌వ‌ర్గంలోనే లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తోంది. పొంగులేటి న‌ట‌న‌ను ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version