కేసీఆర్ ప్రభుత్వంలో 8వేల మంది రైతులు ఆత్మహత్య : రాహుల్ గాంధీ

-

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదివారం సంగారెడ్డి లో ఏర్పాటు చేసిన విజయ పేరు బహిరంగ సభను రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ధరణి పోతల్లో పేదల భూములు గుంజుకున్నారని కంప్యూటర్ ట్రైజేషన్ చేస్తామని 20 లక్షల ఎకరాల భూములు లాక్కున్నారని ఆరోపించారు.

కాలేశ్వరం డ్యాములు లక్ష కోట్లు మింగారన్నారు నేను స్వయంగా డ్యాము ను పరిశీలించానని.. డ్యామ్ కిందకి కుంగి పోయిందన్నారు. ఈ ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారు. హైదరాబాద్ లో నిరుద్యోగ యువతను కలిశాను. వాళ్ళు లక్షల రూపాయలు పెట్టించి కోచింగ్ స్టడీ సెంటర్లలో ఫీజులు చెల్లిస్తున్నారు. కానీ వారికి ఉద్యోగాలు రాలేదన్నారు. తెలంగాణలో నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఉపాధి కోసం లక్షల మంది లాయంలో నిలబడి ఉన్నారని పేర్కొన్నారు. వారి కోసం కేసీఆర్ ఏం చేయలేదని ఆరోపించారు. తెలంగాణను ముందుకు తీసుకెళ్లేందుకు యువకులు ఉన్నారు. మీకు ఈ ప్రభుత్వం పరిపాలన గత ప్రభుత్వం తేడా గమనించాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులు ఖర్చు చేసిన ప్రతి పైసా ఇస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version