వివేకా హత్య కేసుపై కన్నా హాట్ కామెంట్స్‌.. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ..

-

వైయస్ వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పిటిషన్ లో సీబీఐ, ఏపీ హోంశాఖలను ప్రతివాదులుగా చేర్చారు. అయితే కేసు విచారణ తుది దశకు చేరుకుందని… ఈ తరుణంలో సీబీఐ విచారణ అవసరం లేదని ఇప్పటికే కోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. వివేకా హత్య కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

దోషులను తప్పించి అమాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే పోలీసు అధికారులను బదిలీ చేస్తున్నారన్నారు.  కేసును సీబీఐకి అప్పగించాలంటూ.. వివేకా కుటుంబ సభ్యుల కంటే ముందే తాను సీఎంకు లేఖ రాశానని కన్నా వెల్లడించారు. తన తండ్రి ఆశయాలు, సిద్ధాంతాలపై జగన్‌కు నమ్మకం ఉంటే.. పరిటాల రవి హత్య కేసు మాదిరిగా వివేకా హత్య కేసునూ సీబీఐకి అప్పగించాలన్నారు. జగన్.. వైఎస్ రాజకీయ వారసుడయితే స్వచ్ఛందంగా సీబీఐ విచారణ కోరాలని కన్నా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version