బీజేపీకి కన్నా గుడ్‌బై..టీడీపీతో పొత్తు తేలిపోయింది!

-

ఎట్టకేలకు బీజేపీకి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ గుడ్‌బై చెప్పేశారు. గత కొంతకాలంగా పార్టీలో అసంతృప్తిగా ఉంటున్న విషయం తెలిసిందే. అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సోము ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, తాను అధ్యక్షుడుగా ఉన్నప్పుడు నియమించిన వారిని..సోము పక్కన పెట్టేస్తూ వచ్చారని కన్నా విమర్శలు చేస్తూ వచ్చారు. పైగా సోము, జి‌వి‌ఎల్ లాంటి వారు వైసీపీకి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కన్నా…సోము వైఖరి నచ్చక బి‌జే‌పికి గుడ్ బై చెప్పేశారు. మోదీ నాయకత్వంపై ఇప్పటికీ నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. ‘‘నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని ఏకతాటిపై నడిపానని, కానీ సోమువీర్రాజు అధ్యక్షుడు అయ్యాక పరిస్థితి అంతా మారిపోయిందని, సోమువీర్రాజు నాయకత్వంలో బీజేపీ ముందుకు వెళ్లడం లేదని, కక్ష సాధింపులతో సోమువీర్రాజు వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర నాయకత్వ తీరు నచ్చకనే బీజేపీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.

అటు కన్నా పార్టీని వీడటంపై జి‌వి‌ఎల్ స్పందించారు.. కన్నా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశమేనని, గతంలో కూడా సోమువీర్రాజుపై అనేక వ్యాఖ్యలు చేశారని, పార్టీలో సోము‌వీర్రాజు తీసుకున్న నిర్ణయాలు పార్టీ అధిష్టానానికి‌ చెప్పే చేశారన్నారు. తనపై కూడా కన్నా ఎక్కువ విమర్శలు చేశారని,  తన పరిధిలో తాను పని‌ చేస్తున్నానని.. కన్నా విమర్శలపై తాను మాట్లాడబోనన్నారు.

ఇదిలా ఉంటే కన్నా…టి‌డి‌పి లేదా జనసేనలో చేరుతారని ప్రచారం ఉంది. అయితే టి‌డి‌పితో పొత్తుకు జనసేన రెడీగా ఉన్న బి‌జే‌పి సిద్ధంగా లేని విషయం తెలిసిందే. ఒకవేళ టి‌డి‌పితో పొత్తు ఉంటే కన్నా..బి‌జే‌పిలోనే ఉండేవారు అని విశ్లేషకులు అంటున్నారు.  అయితే పొత్తు లేదు కాబట్టే బి‌జే‌పిని కన్నా వీడుతున్నారని తెలుస్తోంది. పొత్తు లేకుండా బి‌జే‌పి గెలవడం కష్టమే..అందుకే కన్నా ఇంకా బి‌జే‌పిని వీడారు. మరి ఆయన టి‌డి‌పిలోకి వెళ్తారో లేక జనసేనలోకి వెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version