కొడాలిపై ‘కాపు’ అస్త్రం..గుడివాడలో డ్యామేజ్ ఉంటుందా?

-

కోడలి: ఎప్పుడు ప్రత్యర్ధులని ఇరుకున పెట్టేలా మీడియా ముందుకొచ్చి విరుచుకుపడే కొడాలి నాని ఇప్పుడు ఇరుకున పడ్డారు. ఆయనని కాపు నేతలు టార్గెట్ చేశారు. తాజాగా చంద్రబాబుపై విమర్శలు చేసే క్రమంలో కొడాలి..కాపు నా…అంటూ వాడిన మాట సంచలనంగా మారింది. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో క్లారిటీ లేదు గాని..ఆయన కాపు నా..అంటూ తిట్టిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

తాజాగా మహానాడు వేదికగా చంద్రబాబు మినీ మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దీనిపై కొడాలి ప్రెస్ మీట్ పెట్టి బాబుని తిట్టారు. యథావిధిగానే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి..ఇప్పుడు ఉత్సవాలు చేస్తారా? అని ఫైర్ అయ్యారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడూ మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేయకుండా..ఇప్పుడేదో పొడిచేస్తున్నట్లు హడావిడి చేస్తున్నారని, ఇక చంద్రబాబు మాటలు ఎవరు నమ్మరని..ఇంకా పరుష పదజాలంతో ఆయన్ని తిట్టిన తిట్టకుండా తిట్టారు.

అదే సమయంలో కాపుల గురించి కామెంట్ చేశారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. కాపులని తిట్టిన కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కాపు నేతలు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే క్షమాపనలు చెప్పాలని అంటున్నారు. గుడివాడలో కాపు ఓట్లే ఎక్కువ అని..ఇప్పటివరకు కాపులు కొడాలికి మద్ధతు ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో కాపుల సత్తా ఏంటో చూపిస్తారని చెబుతున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కొడాలికి కాస్త రాజకీయంగా ఇబ్బంది ఎదురవుతుందనే కామెంట్లు వస్తున్నాయి. గుడివాడలో కాపు ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. గత కొంతకాలంగా వారు కొడాలికే మద్ధతు ఇస్తున్నారు. మరి జనసేన ప్రభావం, ఇప్పుడు వ్యాఖ్యల ఫలితంగా గుడివాడలో ఏమైనా కొడాలికి డ్యామేజ్ జరుగుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version