హాట్ టాపిక్ గా మారిన మంత్రులు డిన్నర్ భేటీ..! ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది..

-

ముగ్గురు దళిత మంత్రులు డిన్నర్ భేటీ హాట్ టాపిక్ గా మారింది.. దళితులను సీఎం చెయ్యాలనే డిమాండ్ వారి చర్చల్లో సారాంశంగా ఉంది.. దీంతో అక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది.. సీఎం రాజీనామా చేస్తే.. తమకే అవకాశం ఇవ్వాలని దళిత మంత్రులు డిమాండ్ చేస్తుండటంతో ఆ రాష్ట రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.. ఇంతకీ ఈ కుర్చీ రాజకీయాలు ఎక్కడంటే.. మీరే చూడండి..

కర్ణాటకలో రాజకీయాలు ఇంట్రస్టింగ్ మారాయి.. మూడా స్కామ్ లో ఉన్న సీఎం సిద్దారామయ్య రాజీనామా చెయ్యాలని ప్రతిపక్షంతో పాటు.. స్వపక్షంలో కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి.. ఈ క్రమంలో దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది.. కర్ణాటకు 22వ ముఖ్యమంత్రిగా ఉన్న సిద్దరామయ్య. సీనియర్ రాజకీయ నాయకులు.. మూడా స్కామ్ లో ఆయన భాగస్వామిగా ఉన్నారంటూ.. కేసులు నమోదవ్వడంతో.. ఆయన రాజీనామాపై ప్రతిపక్షం పట్టుబడుతోంది..

ప్రతిపక్షంతో కూడా స్వంత పార్టీలోనే దళిత మంత్రులు కూడా ఆయన రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారట.. ఇదే సమయంలో ఆయన రాజీనామా చేస్తే.. దళితులకు సీఎంగా అవకాశం కల్పించాలని వారు అధిష్టానాన్ని కోరుతున్నారు.. ఇటీవల సీఎం స్వంత జిల్లాలోనే మంత్రి సతీష్..మరో ఇద్దరు మంత్రులతో భేటీ అవ్వడంలో పార్టీలో తీవ్ర చర్చలకు దారి తీస్తోంది..

మంత్రులతో పాటు పలువురు దళిత ఎమ్మెల్యేతో సతీష్ భేటీ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీలో కలకలం రేపుతోంది.. ఎంపీ సునీల్ బోస్ ఇంట్లో ఇద్దరు మంత్రులతో ఆయన బేటీఅయి.. సీఎం కుర్చి గురించి చర్చించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం సిద్దారామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ అలర్ట్ అయ్యారట.. మొత్తంగా కన్నడ రాజకీయం ఎటు పోతుందో అన్న చర్చ జరుగుతోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version