ఢిల్లీకి కేసీఆర్…స్టేట్‌లో స్ట్రాటజీ అదేనా?

-

మొత్తానికి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి కేసీఆర్ రెడీ అయిపోతున్నారు…ఇప్పటికే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చెప్పి తిరుగుతున్నారు. ఎలాగైనా కేంద్రంలో బీజేపీ సర్కార్‌ని గద్దె దించాలని చెప్పి పనిచేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని బీజేపీ టార్గెట్ చేయడంతో..కేసీఆర్ కూడా ఢిల్లీలో మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఏదొకవిధంగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. మోదీ వల్ల దేశం నాశనం అయిపోయిందని మాట్లాడుతున్నారు.

అలాగే తాను ఇంకా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని, రాష్ట్ర ప్రజలు ఆశీర్విదించాలని తాజాగా నిజామాబాద్ సభలో ప్రజలని కోరారు. కేంద్రంలో 2024 ఎన్నికల తర్వాత బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కానుందని, బీజేపీ ముక్త్‌ భారత్‌ సాధనలో తెలంగాణ రాష్ట్రం కీలకం కావాలని, రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తే ఇకపై దేశ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని కేసీఆర్ ప్రకటించారు.

అంటే ఇకపై దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఇంకా యాక్టివ్ అవుతారని తెలుస్తోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో దేశంలోని విపక్ష పార్టీని నేతలని కలిశారు. తాజాగా బీహార్ సీఎం నితిశ్ కుమార్‌ని, ఆర్జేడీ అదినేత లాలుప్రసాద్ యాదవ్‌ని కలిశారు. దేశంలోని విపక్ష పార్టీలని ఏకం చేసి…కూటమి కట్టి బీజేపీని గద్దె దించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలని మరింత ముమ్మరం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇకపై దేశ రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో స్టేట్‌లో రాజకీయం కేటీఆర్ నడిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అయితే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి మళ్ళీ గెలిచి తెలంగాణలో అధికారంలోకి వస్తే కేసీఆర్ స్ట్రాటజీ మార్చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కేటీఆర్‌కు సీఎం పీఠం అప్పజెప్పి…ఈయన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతుంది. అప్పుడు విపక్ష పార్టీలని ఏకం చేసే…బీజేపీని గద్దె దించే ప్రయత్నాలు చేయొచ్చు. మొత్తానికైతే కేసీఆర్ పక్కా స్ట్రాటజీతోనే ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version