తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశం అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎటువంటి విషయాన్నైనా తమదైన శైలిలో నవ్వు పుట్టించే విధంగా చెబుతూనే మరోపక్క ప్రత్యర్థులపై సెటైర్లు వేసుకుంటూ వెళ్లిపోతుంటారు. అలా అని ఎప్పుడూ నవ్వుతూ ఉండరు…ఎప్పటికప్పుడు ఆయన మూడ్ ను బట్టి వ్యవహరిస్తుంటారు. ఒక్కోసారి విపరీతంగా జోకులు వేస్తే, మరో సమావేశంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తారు. సరిగ్గా ఈ విధంగానే కరోనా వైరస్ గురించి పెట్టిన మీడియా సమావేశంలో జనతా కర్ఫ్యూ తెలంగాణ ప్రజలు పాటించిన క్రమంలో కెసిఆర్ మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులు చాలా దారుణంగా విచిత్రంగా ప్రశ్నలు వేయటంతో, కెసిఆర్ అందరి ముందు కోపం పడటం జరిగింది. ఓ విలేకరి వేసిన ప్రశ్నకు…చాలా సీరియస్ గా క్లాస్ పీకారు.
ఇలాంటి చిల్లర ప్రశ్నలు వేయకండి అంటూ సదర్ విలేకరిపై మండిపడ్డారు. దేశమంతటా సంక్షోభం నెలకొన్న సమయంలో దీన్ని ఆసరాగా తీసుకుని నిత్యావసర ధరలు పెంచ కూడదని కెసిఆర్ చెప్పటం జరిగింది. ఎవరైనా పెంచితే ఊరుకునే ప్రసక్తి లేదని కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి సీరియస్ టైం లో …సార్ బార్ షాపులు తీయవచ్చా అంటూ కెసిఆర్ ని ప్రశ్నించడంతో ఫుల్ సీరియస్ అయ్యారు సదరు విలేకరిపై. ఏం మాట్లాడుతున్నావ్ ఇలాంటి ప్రశ్నలు వేయడానికి ఇది సమయమా అంటూ మండిపడ్డారు.
ఐ యామ్ సారీ.. ఇలాంటి చిల్లర ప్రశ్నలు వేయకండి అంటూ బాగానే క్లాస్ పీకారు కేసీఆర్. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో, కేసిఆర్ కి కోపం రావడం లో తప్పేం లేదు అంటూ నెటిజన్లు సపోర్ట్ చేస్తు కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఎవరికైనా బీపీ వస్తుందని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.