బడ్జెట్‌పై రచ్చ: కేసీఆర్ సర్కార్ వర్సెస్ గవర్నర్!

-

తెలంగాణలో కేసీఆర్ సర్కార్, గవర్నర్ తమిళిసైల మధ్య వార్ నడుస్తోంది. చాలా రోజుల నుంచి ఇరు వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. అసలు కే‌సి‌ఆర్ సర్కార్ తనకు ప్రోటోకాల్ పాటించడం లేదని, ఎక్కడకక్కడ అవమానిస్తుందని చెప్పి గవర్నర్ తమిళిసై ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. అటు కే‌సి‌ఆర్ సర్కార్ సైతం..కీలకమైన బిల్లులని గవర్నర్ పెండింగ్ లో పెడుతున్నారని, బి‌జే‌పి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

ఇలా కే‌సి‌ఆర్ సర్కార్-గవర్నర్ మధ్య రచ్చ నడుస్తోంది. తాజాగా రిపబ్లిక్ డే వేడుకల్లో సైతం గవర్నర్…కే‌సి‌ఆర్ సర్కార్ టార్గెట్ గా విమర్శలు చేశారు. దీంతో బి‌ఆర్‌ఎస్ నేతలు వరుసపెట్టి గవర్నర్ పై విరుచుకుపడ్డారు. తాజాగా బడ్జెట్ పై మళ్ళీ రగడ నడుస్తోంది. ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయని, బడ్జెట్‌కు సంబంధించిన పత్రాలని అనుమతి కోసం కే‌సి‌ఆర్ సర్కార్..గవర్నర్‌కు పంపింది. కానీ గర్వర్న్ మాత్రం బడ్జెట్ కు ఆమోద్రముద్రవేయలేదు.

అయితే గత ఏడాది తన ప్రసంగం లేకుండానే కే‌సి‌ఆర్ సర్కార్ బడ్జెట్ ముగించేసింది. ఈ సంవత్సరం కూడా అదే చేయడానికి రెడీ అయినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తమిళిసై రివర్స్ లో బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయట్లేదనే ప్రచారం ఉంది..ఇదే సమయంలో గవర్నర్‌పై మళ్ళీ బి‌ఆర్‌ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇదే సమయంలో గవర్నర్ వ్యవహారశైలిపై కే‌సి‌ఆర్ సర్కార్ హైకోర్టుకు వెళ్లింది.  బడ్జెట్‌ను ఆమోదించడంలేదంటూ లంచ్‌మోషన్ పిటిషన్  దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారణకు హైకోర్టు అనుమతించగా, ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ ధవే వాదనలు వినిపించారు.

ఆర్థిక శాఖ కార్యదర్శి గవర్నర్‌ను సంప్రదించారని.. అయినా గవర్నర్ సంతకం చేయలేదని, అసెంబ్లీలో తన ప్రసంగం ఉందా అని గవర్నర్ అడిగారని, కోర్టుకు రావడం … గవర్నర్‌పైనే పిటిషన్ దాఖలు చేయటం తమ ఉద్దేశం కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇక ఈ అంశంలో కోర్టు ఎలా ముందుకెళుతుందో చూడాలి. మొత్తానికి కే‌సి‌ఆర్‌ సర్కార్, గవర్నర్ మధ్య వార్ ఇలాగే నడిచేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version